యోగప్రస్థానం (7వ భాగం )

“న కర్మాణమనా రంభా నానైష్కర్మ్యము పురుషో 2ష్ణు తే

నచ సన్యసనాదేవ సిద్ధిమ్ సమాధిగచ్ఛతి “-గీత 3–4

పాపక్షయమునకు కారణమైన కర్మయోగాన్ని అనుసరించకుండా కేవలం సన్యసించి నంతమాత్రాన నిష్కర్మభావాన్ని పొందడం అసాధ్యం .కర్మయోగం అంత ప్రభావం కల్గినట్టిది .ఏదో విన్న మాటలను వల్లెవేస్తూ ఉపన్యాస కేసరి గ పేరుపొంది మఠాలు ,ఆశ్రమాలు నిర్మించి మహా భోగమయ జీవితాన్ని అనుభవిస్తూ సన్యాసిని అంటూ లోకాన్ని తనను మోసగిస్తూ ఉండేవారు “కర్మబ్రహాముభయ భ్రష్టమ్ “అన్నట్లు కర్మకు ,జ్ఞానం కు రెంటికి చెడినవారైతారు .నేడు ఎటుచూసినా కనిపిసున్నది అదే “.కలౌ వేదాంతినస్సర్వే “కలియుగంలో అందరూ వేదాంతం చెప్పేవారే .మనం దేనికి అర్హులము కాదని శాస్త్రం విధిస్తుందో దాన్నే చేస్తాం .అదే కలియుగ ధర్మం .దానికే ప్రచారం .అన్నిరకాల వత్తాసు లభిస్తాయి .ఇట్టివారిని గూర్చి వేదాంతపంచదశి లో “ఆసుప్తే రామృతే :కాలం నాయెద్వేదాంతచన్తాయ ,సుప్తేరుథాయ సుప్య్నతం “ఒకసారి వేదాంతం ,ఒకసారి రాజకీయాలు ,ఒకసారి దేవతారాధన ,ఒకసారి శాస్త్రచర్చ ,ఒకసారి కావ్యసంగీత చర్చ వంటి కార్యక్రమాలతో ధ్యేయమంతా లోకోద్ధరణమే అన్నట్లుగా కలం గడిపే సన్యాసి ఎప్పటికి జ్ఞానాన్ని పొందజాలదు .

సామాన్యుడనునుండి సన్యాసి వరకు ప్రతి వాడు తన ఇప్పట్టి స్థాయి నిబట్టి తాను అనుసరించి పాటించాల్సిన విధానమేదో సరైనా అవగాహనతో ,మార్గదర్శకత్వంలో నిశ్చయించుకుని తదనుగుణంగా సాధనచేస్తూ క్రమంగా ఉన్నత స్థాయి ని అందుకోవాల్సనిదే .వేరు మార్గం లేదు .స్వస్తి( యోగప్రస్థానములో మొదటి ఉపదేశం ముగిసింది )