యోగప్రస్థానము( 5విభాగము )2
పైశ్లోకము లో ఎన్నోవిధాలుగా లంపాటలతో బాధపడేవానికి విచారమార్గము తో తత్వజ్ఞానము సిద్ధిఞ్చదు .అటువంటివారికీ యోగప్రస్థానము మార్గమే శరణ్యము .దీనివలన కర్త్రుత్వ ,భోక్తృత్వ రూపాత్మకమైన బుద్ధి అనే ప్రమాదం నుండి తప్పిచుకుంటాడు .దీన్ని ఇంకొంచం వివరించు కుంటే ప్రతి క్షణం మనం నేనే చేస్తున్నాను .నేనే అనుభవిస్తున్నాను .అనుకుంటూ ప్రతి పని లో మనలను చూసుకుంటున్నాము .ఇదంతా అజ్ఞానలక్షణమ్ .దీన్ని అర్థం చేసుకోవడానికి తాను ఈ శరీరము కాదు అనే నిశ్చయ జ్ఞానం కల్గవలెను .దానికి ఆధ్యాత్మదర్శనము ఒక్కటే మార్గం .స్థూల,సూక్ష్మ .కారణ శరీరాలను తనుకాడని తెలుసుకోవడం వల్లనే కర్త్రుత్వ ,భోక్తృత్వ భ్రాంతి వదుల్తుంది .
“ఆకర్త్రుత్వానుభవ పూర్వకసాంఖ్య :”నేను దేనికీ కర్తను కాను .అనే తెలివిడి అనుభవ పూర్వకంగా నిశ్చయించుకోవడమే జ్ఞానము .ఇది విచారమార్గముతో లభించదు .యోగవిధానములో దేహభ్రాంతి వదిలేవరకు దీన్ని స్వీకరించలేము .కర్త్రుత్వం ఉండేవరకు మనస్చాంచల్యం పోదు .దీనిని ఇంకా లోతుగా పరిశీలిస్తే దేహాదులందు అభిమానము ఎలా అజ్ఞానమో అట్లే వాటియందు అనాత్మ బుద్ధి (దేహాదులు నేనుకాడు అనుకోవడం )కూడా అజ్ఞానమే .”ఆత్మత్వమివ అనాత్మ త్వమపి సా అవిద్యస్యైవ “అనే వాక్యం దీన్నే వివరించింది .అందుకే గీతలో (4–41)”యోగాసన్న్యస్త కర్మణామ్ జ్ఞాన సంచిన్న సంశయం ,ఆత్మవంతం న కర్మాణి నిబద్నన్తి ధనంజయ “అన్నాడు .యోగపద్ధతిలో అహం పదార్థ విజ్ఞానాన్ని పొంది విచారపద్ధతిలో స్వపరా బెదరహితుడు గా అనుభవాన్ని పొంది బ్రహ్మజ్ఞానిగా మారుతున్నాడు .
“నావిరతో దుశ్చరితాత్ నాశాంతో న సమాహిత :
నాశాంత మానసోవాపీ ప్రజ్ఞానేనైన మాప్నుయాత్ “అశాస్త్రీయ పనులను చేసేవాడు ,ఇంద్రియనిగ్రహం లేనివాడు ,ఏకాగ్రత లేనివాడు ,నిశ్చల మైన ,ప్రశాంతమైన మనస్సు లేనివాడు ఆత్మజ్ఞానాన్ని పొందలేదు .అట్టివానికి యోగ ప్రస్థానమే తగినది .అంటే ఆధ్యాత్మదర్శన అభ్యాసయోగమే శరణ్యము .అందుకే “సన్యస్య శ్రవణం కుర్యాత్ “అన్నారు .దీన్ని తర్వాతి భాగంలో వివరించుకుందాము .స్వస్తి (6వభాగం కొనసాగుతుంది )
‘

