ఇ-ప్రగతి జాలగూడు — ఒక విశ్లేషణ

e-pragati.in

ఈ పథకం గురించి, ఆంధ్ర ప్రభుత్వం వారి మాటల్లో:

e-Pragati, the Andhra Pradesh State Enterprise Architecture, is this new paradigm. It is a mission-centric approach and a framework, to galvanize the pan-government ecosystem by transcending boundaries to design and deliver services in a coordinated, integrated, efficient and equitable way that citizens and businesses demand and deserve, aimed to realize the Sunrise Andhra Vision 2022.

ఆధార్ ఉంటేనే ఉపయోగించుకోవడం అనేది నిష్పాక్షికమైన పద్ధతి (equitable) ఎలా అవుతుంది?

(Login screen)
(From FAQ)

గమనిక 1: myap.e-pragati.in లైవ్ సైటు ఐతే, qa-myap.e-pragati.in అనేది గుణనిర్థారణ (QA) సైటు (అంతా సరిగా పనిచేస్తుందో లేదో ముందు పరీక్షించడానికి). సాధారణంగా QA సైటు అందరికీ కనబడకూడదు.

గమనిక 2:

idm.e-pragati.in :: 103.210.75.99 :: Hosted at PI Datacenter (Mangalagiri)

myap.e-pragati.in :: 104.81.22.185 :: Hosted on Akamai CDN (Multi-location)

qa-myap.e-pragati.in :: 36.255.252.154 :: Hosted at PI Datacenter (Mangalagiri)

  • వర్డ్‌ప్రెస్ తాజా వెర్షను 4.9.7 కానీ http://e-pragati.in జాలగూడు ఇంకా 4.8.5లోనే ఉంది.
  • ఇ-ప్రగతి జాలగూడుకు ఒక వర్డ్‌ప్రెస్ టెంప్లేటు వాడుతున్నప్పుడు అన్ని పేజీలు పూర్తిగా మార్చకుండా అడ్డదిడ్డంగా వదిలేయడమేమిటి? అంటే అడిగేవారు లేరనా? కోట్లకొద్దీ ప్రజల సొమ్ము ఖర్చు పెడుతున్నప్పుడు ఎందుకు అడగం? (2030 కోట్లు?)

లాగిన్ పేజీలు:

https://myap.e-pragati.in/prweb/eLHqddtvdLxviyYZjq1ZbHnrlSUqe2JU*/!STANDARD

https://qa-myap.e-pragati.in/prweb/eLHqddtvdLxviyYZjq1ZbHnrlSUqe2JU*/!STANDARD

https://myap.e-pragati.in/prweb/PRServletCustom/eLHqddtvdLxviyYZjq1ZbHnrlSUqe2JU*/!STANDARD

(అరకొర పనులు)

మీ వాడుకరి పేరు మర్చిపోతే ఇక్కడ నుండి తెచ్చుకోవచ్చు. కొత్త ఖాతాను ఇలా కూడా సృష్టించుకోవచ్చు. ఈ లంకెలు నాకు కోడులో కనబడ్డాయి. పనిచేయవచ్చు.

అసంపూర్తి పేజీలు:

అసంబద్ధ పేజీలు:

ఖాళీ పేజీలు:

(ఇలాగే ఇంకొన్ని)

  • ఈ లంకె ఈ క్రింది దోషాన్ని చూపించింది ఒక్కసారి:
  • కోడులో ఇలా ఉంది. ఆధార్‌లో ఎన్ని అంకెలు ఉంటాయో కూడా తెలియదా?

var userName = document.getElementById(“aadhaarNumber”);
if(userName != null && userName.value.length < 12){
document.getElementById(“errmsg_7”).value = “Enter Valid 14 digit Aadhaar Number”;
isSubmit = 1;
}

  • e-pragati.in డొమెయిన్ని గోడాడీలో రిజిస్టరు చేసి, హోస్ట్‌గేటరు ముంబాయి సర్వరులో జాలగూడును పెట్టారు. ఎన్.ఐ.సి.లో ఎందుకు రిజిస్టరు చేయలేదో, .nic.in లేదా .gov.in డొమెయిన్ ఎందుకు వాడలేదో తెలియదు. ఎన్.ఐ.సి. సర్వరులో జాలగూడును ఎందుకు పెట్టలేదో కూడా తెలియదు. అసలు e-pragati.ap.gov.in అనేది మొదట వాడినపుడు దానినే ఎందుకు వాడలేకపోయారో? NIC ఈ ప్రాజెక్టుయొక్క అవసరాలకు సరిపోలేదా? లేక ఫైబర్‌గ్రిడ్‌ని, ఇతర ప్రభుత్వేతర సంస్థలను వాడుకోవాలనా?
  • e-pragati.in డొమెయిన్ ఇ-మెయిల్ కొరకు గూగుల్‌ని వాడుతుంది. అది అందుబాటులో లేనప్పుడు మాత్రమే సైటు ఉన్న సర్వరును ఇ-మెయిల్ కొరకు వాడుతుంది. దీని అర్థం ఏమిటంటే ఇది వాడుకునే వారి సమాచారం (వారి ఆధార్ సంఖ్యలతో సహా) గూగుల్‌కి అందుబాటులో ఉంటుంది. గూగుల్ అమెరికా సంస్థ కనుక ఈ సమాచారమంతా పేట్రియాట్ చట్టం ద్వారా అమెరికా ప్రభుత్వానికి కూడా అందుబాటులోకి వస్తుంది.

Non-authoritative answer:
e-pragati.in mail exchanger = 10 alt3.aspmx.l.google.com.
e-pragati.in mail exchanger = 10 e-pragati.in.
e-pragati.in mail exchanger = 10 alt4.aspmx.l.google.com.
e-pragati.in mail exchanger = 5 alt2.aspmx.l.google.com.
e-pragati.in mail exchanger = 1 aspmx.l.google.com.
e-pragati.in mail exchanger = 5 alt1.aspmx.l.google.com.

  • లాగిన్ ప్రక్రియ అవసరమైనదానికన్నా ఎక్కువ సమాచారాన్ని బహిర్గతపరుస్తుంది. ఏమి లేదో తెలిస్తే, ఏమి ఉందో కూడా తెలుసుకోవచ్చు అనేది వేరే చెప్పనక్కర్లేదు కదా!
  • అలాగే, ఒకసారి తప్పు ఇ-మెయిల్‌తో పాస్వర్డు తిరిగి పొందడానికి ప్రయత్నించిన తరువాత ఒక దోషం కనపడింది.
  • వర్డ్‌ప్రెస్ ఖాతాల పేర్లు ఎంచడాన్ని (user enumeration) అసాధ్యం చేయలేదు. admin, surya నాకు కనబడిన ఖాతాలు.
  • ఈ లంకె tomcat 7.0.73 వాడుతున్నట్లు ఎంచక్కా చూపిస్తోంది.
(unnecessary disclosure of technology & version)

ఇదే పేజీయొక్క లైవ్ సైటు లంకె చూస్తే tomcat 9.0.8 వాడుతున్నట్లు చూపిస్తోంది. పరీక్షించడానికో వెర్షను, వాడుకకు ఇంకో వెర్షనా? ఇదేమి చోద్యం??

(unnecessary disclosure of technology & version)
  • “మీ సేవ” ప్రస్తుతం అందించే సేవలను ఇ-ప్రగతి కూడా అందించబోతుంది. ఇంకా మరికొన్ని సేవలు కూడా అందించబోతుంది. ఐతే “మీ సేవ”పై పెట్టిన ఖర్చు వృధా కాకుండా ఇది ఎలా చేస్తున్నారు అన్నదానిలో స్పష్టత లేదు. మొట్టమొదటి ప్లాను (అనుబంధం III) ప్రకారం “మీ సేవ”ను పెద్ద మార్పుచేర్పులు లేకుండానే ఇ-ప్రగతిలో అనుసంధానించాలి.
  • (ఇంకా ఉంది…)

--

--