ఎన్ని విధాలుగా భారత పౌరుల ఆధార్ వివరాలు బహిర్గతమవుతున్నాయి?

నా స్వీయ అనుభవంలో తెలిసిన చేదు నిజాలు

ఆధార్ వివరాలు పోస్టాఫీసుల్లో, పెంటకుప్పల్లో, ఇంకా జాలలో కూడా దొరికేస్తున్నాయని చదివాక, ఆ మొదటి రెండు చోట్లా వెతికే ఓపిక నాకు ఎటూ లేదు కనుక కనీసం జాలలో వెతికి నిజానిజాలు తెలుసుకుందాం అనుకున్నా. ఇది కొన్ని నెలల కిందటి మాట.

అప్పటినుండీ నే జాలలో వెతికిన ప్రతిసారీ నాకు కొత్త ఆధార్ సంఖ్యలు, అవి ఎవరివో వారి పేర్లతో, వారి ఇంకొన్ని వివరాలతో సహా దొరికేస్తూ ఉన్నాయి! ఎక్కడెక్కడ దొరికాయి అంటారా? ఇదిగో మీరే చూసి తరించండి:

  1. ప్రభుత్వ జాల గూళ్లు — చాలా వరకూ ఆధార్ వివరాలు బహిర్గతమవడానికి ఇవే కారణం. అందునా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జాలగూళ్లు ముఖ్య పాత్రను పోషించాయి.
  2. ఉద్యోగుల జీతభత్యాలు, తదితర వివరాలు ఉన్న దస్త్రాలు
  3. పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల వివరాలు
  4. ఉద్యోగాలకు ఎంపిక కాబడిన అభ్యర్థుల వివరాలు
  5. సంస్థలు శిక్షణ ఇచ్చిన లేదా వర్క్‌షాపుకు హాజరైన విద్యార్థుల జాబితాలు
  6. ప్రభుత్వ సంస్థల్లోని గురువుల వివరాలు
  7. ప్రభుత్వ సంస్థల్లో పనిచేసేవారి వివరాలు
  8. ప్రభుత్వ పాఠశాలల్లోని గురువుల వివరాలు
  9. సర్వ శిక్షా అభియాన్ ఉద్యోగస్థుల వివరాలు
  10. నరేగా పథక లబ్ధిదారుల వివరాలు
  11. స్వచ్ఛభారత్ సర్వే చేసినవారి వివరాలు
  12. సమాచార హక్కు దరఖాస్తులు, తీర్పులు
  13. దస్త్రాన్ని పిడిఎఫ్ లోకి మార్చే జాల సాధనాలు

--

--