మీ పే టిఎం వాల్లేట్ : : పేటిఎం పేమెంట్స్ బ్యాంకు,వివిధ రుసుములు

భారతదేశ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) ఆదేశాల ప్రకారం వన్97 కమ్యూనికేషన్స్ అవసరమైన ఆమోదాలు పొందిన తరువాత కొత్తగా ఇన్కార్పోరేట్ చెయ్యబోయే పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL)కు వాల్లేట్ బిజినెస్ ను బదిలీ చేస్తుంది.

పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL) లో 51% విజయ్ శేఖర్ శర్మ , 49% వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ యాజమాన్యంలో ఉంది.పేటిఎం పేమెంట్స్ బ్యాంకు నిజంగానే ఒక్క భారత సంస్థ,ఇది భారతీయుల యాజమాన్యంలో నిర్వహించబడుతోంది.

ప్రస్తుతం,యుసర్స్ అందరికి 31 జనవరి 2017 వరకు పేటిఎం వాల్లేట్ నుండి ఏ బ్యాంకు కు అయిన అన్ని నగదు బదిలీలకు 0% చార్జ్ చెయ్యబడ్తుంది.ఒక్కసారి మా పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ లాంచ్ అయ్యిన తరువాత అంటే 31 జనవరి 2017 తరువాత మీ పేటిఎం వాల్లేట్ నుండి పేటిఎం పేమెంట్స్ బ్యాంకు కి నగదు బదిలీ కి 0 % ఫి తో ఎల్లప్పుడు అనుమతిస్తాము.

తరుచు అడుగు ప్రశ్నలు :

ప్ర. నా ప్రస్తుత పేటిఎం వాల్లేట్ కి ఏం జరుగుతుంది ?

జా: ఇది పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ కు ఉన్నది ఉన్నట్లుగా బదిలీ చేయబడుతుంది అనగా కెవైసి వాల్లేట్ , కెవైసి వాల్లేట్ గా ,మినిమం కెవైసి వాల్లేట్ మినిమం కెవైసి వాల్లేట్ గా ఉంటుంది.

ప్ర. పేటిఎం వాల్లేట్ లో వున్న నా నగదు ఏమవుతుంది?

జా: మీ నగదు పేటిఎం వాల్లేట్ లో అత్యంత సురక్షితంగా ఉంటుంది.అది ఎల్లప్పుడు మీదే దానిని మీరు ఎప్పటికి కోల్పోరు.మీ ప్రస్తుత పేటిఎం వాల్లేట్ లో ఏదైనా కొంత నిల్వ ఉంటే అది మీ కొత్త పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ వాల్లేట్ లో కనిపిస్తుంది.ఒక్కవేళ్ళ 6 నెలలుగా మీ వాల్లేట్ గనుక ఇన్ఆక్టివ్ గా ఉండి జీరో బాలన్స్ ఉంటే, అది మీ పేటిఎం చెల్లింపులు బ్యాంక్ వాల్లేట్ కి బదిలీ చేయబడదు.ఆ సమయం లో మీరు యాప్ లేదా ఇ-మెయిల్ ద్వారా లాగిన్ అయ్యి ప్రత్యేకంగా సమ్మతిని తెలియజేయవలసి ఉంటుంది.

ప్ర. నాకు పేటిఎం పేమెంట్స్ బ్యాంకు నుండి ఒక్క బ్యాంకు ఎకౌంటు వస్తుందని దీని అర్థం అవునా?

జా: కాదు. ఇది కేవలం పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ అను కొత్త కంపెనీ కి బదలాయించే వాల్లేట్ ఓనర్షిప్ మాత్రమే. ఒక్కసారి మేము మా బ్యాంకు ని లాంచ్ చేస్తే మీరు మాతో వేరే బ్యాంకు ఎకౌంటు ని ఓపెన్ చెయ్యాలని ఒక్క ఆప్షన్ ని ఇస్తాము .

ప్ర. నేను పేటిఎం పేమెంట్స్ బ్యాంకు వాల్లేట్ నుండి ఏ ఇతర బ్యాంక్ కి కైనా కి నా డబ్బు ను పంపవచ్చా?

జా: అవును,మీరు ఏ బ్యాంకు ఎకౌంటుకైనా నగదును మీ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ వాల్లేట్ నుండి పంపవచ్చు.

ప్ర. వాల్లేట్ ని కొనసాగించడానికి పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ లాంచ్ అయ్యిన తరువాత అందులో ఎకౌంటు ని తప్పనిసరిగా ఓపెన్ చెయ్యలా?

జా: వాల్లేట్ ని ఉపయోగించడానికి మీరు పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ లో ఎకౌంటు ఓపెన్ చెయ్యనవసరం లేదు.

ప్ర. నేను నిస్క్రమించావచ్చా?

ఒకవేళ మీరు మీ పేటిఎం వాల్లేట్ ప్రయోజనాలను కొనసాగించకూడదని నిర్ణయించుకుంటే దయచేసి మాకు care@paytm.com కు ఈమెయిలు చెయ్యండి లేదా Paytm.com/care కు లాగిన్ అయ్యి ఎందుకు నిష్క్రమిస్తునారో అక్కడున్న ఎంపిక ద్వార తెలియజేసి మీ బాలన్స్ ను ఒక్కసారి గా మీ స్వంత బ్యాంకు ఖాతాకు బదిలీ చేసుకోవచ్చు.మీ డబ్బు ఎక్కడికి పంపాలనుకుంటున్నారో ఆ బ్యాంకు పేరు ,ఖాతాదారుని పేరు, ఖాతా సంఖ్య ,బ్యాంక్ యొక్క IFSC కోడ్ ను సూచించండి.

ప్ర. ఈ బదిలీ కి నేను ఏదైనా ఫీజు ను చెల్లించవలసి ఉంటుందా ?

జా: ఈ బదిలీకి మీరు ఎటువంటి ఫీజు ను చెల్లించక్కర్లేదు.

ధన్యవాదాలు !