అనుష్క‌కి యాంక‌ర్ ఎఫైర్ త‌ల‌నొప్పి….!

అనుష్క‌కి కొత్త త‌లనొప్పి మొద‌ల‌యింది. ఈ నెల 27న ఆమె సైజ్ జీరో ఒక్క‌టే విడుద‌లవుతుంద‌ని భావించారంతా. కానీ, తెలుగులో తొలి లెస్బియ‌న్ మూవీగా పేరు తెచ్చుకున్న ఎఫైర్ విడుద‌ల‌కు రెడీ అవుతోంది. ఈ మూవీ కూడా సైజ్ జీరో రిలీజ్ రోజే రిలీజ్ అవుతోంది.
తెలుగు బుల్లితెర‌పై యాంక‌ర్‌గా పేరు తెచ్చుకున్న ప్ర‌శాంతి.. ఈ సినిమాలో కీల‌క పాత్ర పోషించింది. మ‌రో హీరోయిన్ గీతాంజ‌లి, శ్రీరాజ‌న్ ఇత‌ర కీల‌క పాత్ర‌లు చేశారు. భీమవరం టాకీస్ పతాకంపై శ్రీ రాజన్ దర్శకత్వంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించారు. బోల్డ్ కంటెంట్‌తో రూపొందింది ఈ చిత్రం. ఇద్ద‌ర‌మ్మాయిల ల‌వ్ స్టోరీ ఇది. అయితే, వారి ప్రేమ‌కు ఎవ‌రు అడ్డుప‌డ్డారు? స‌మాజంలో వారు ఫేస్ చేసిన క‌ష్టాలు ఏంటి? సామాజిక అడ్డంకుల‌ను వారు ఎలా అధిగ‌మించారు? అనే అంశాల‌పై త‌మ సినిమా పూర్తిగా చ‌ర్చించిందంటున్నారు చిత్ర యూనిట్ స‌భ్యులు. మ‌రి, ఇలాంటి సినిమాని తెలుగు ప్రేక్ష‌కులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.