బతుకమ్మ సంబరాలు

రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ఘనంగా సాగుతున్నాయి.

బతుకమ్మ సంబరాలు

మెదక్ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన శ్రీఏడుపాయల వనదుర్గామాతను గురువారం తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కవిత, శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ రాజమణి మురళీధర్‌యాదవ్ గురువారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

బతుకమ్మ సంబరాలు

ఏడుపాయల దేవస్థాన కార్యాలయం నుంచి ఎంపి , డిప్యూటీ స్పీకర్ పల్లెంలో పట్టువస్త్రాలను నెత్తిపై పెట్టుకొని బాజాభజంత్రీల మధ్య ఊరేగింపుగా వనదుర్గామాత ఆలయానికి వెళ్లి వేద పండితులు ఆలయ అర్చకుల వేద మంత్రోచ్చరణల మధ్య అమ్మవారికి సమర్పించారు.

బతుకమ్మ సంబరాలు

ఆలయ గర్భాలయంలో వారికి ఆలయ మర్యాదలతో ఆలయ ఈఓ టి.వెంకటకిషన్‌రావు పూలమాలలతో శాలువలు కప్పి, జ్ఞాపికలను ఇచ్చి ఘనంగా సత్కరించారు. ఇక్కడ జరిగిన బతుకమ్మ వేడుకల్లో కవిత, పద్మాదేవేందర్ రెడ్డి పాల్గొన్నారు.

బతుకమ్మ సంబరాలు

అనంతరం మీడియాతో కవిత మాట్లాడుతూ ఎంత కష్టపడి సాధించుకున్న మన తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చుకుందామని, అందుకు ప్రతిఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

బతుకమ్మ సంబరాలు

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కోటి బతుకమ్మలను ఎత్తి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని పేర్కొన్నారు.

బతుకమ్మ సంబరాలు

అలాగే బంగారు బతుకమ్మనెత్తి బంగారు తెలంగాణను సాధిస్తామని ఆమె వివరించారు.

బతుకమ్మ సంబరాలు

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న బతుకమ్మ ఉత్సవాలలో భాగంగా బుధవారం సాయంత్రం రవీంద్రభారతి ప్రధాన ఆడిటోరియంలో నాట్యాచారిణి భాగ్యలత సారథ్యంలో ‘మహిషాసురమర్దని’ నృత్యరూపకం నయనానందకరంగా జరిగింది.

బతుకమ్మ సంబరాలు

ఈ అంశంలో పదిమంది శిష్యులు పాల్గొన్నారని నాట్యాచారిణి భాగ్యలత చెప్పారు.

బతుకమ్మ సంబరాలు

రాగమాళికా రాగంలో ‘బ్రహ్మాంజలి’ అంశంతోపాటు ‘తరంగం’ అంశాన్ని కూడా చిన్నారులు ప్రదర్శించారు.

బతుకమ్మ సంబరాలు

‘మరకత మణిమయ..’ ఆరభి రాగంలో గానం చేయగా చిన్నారులు పళ్లెంలో కాళ్లు ఉంచి చేతులతో దీపాలు తలపై నీటితో ఉవున్న చెంబుఉంచుకొని అద్భుతంగా నర్తించారు.

బతుకమ్మ సంబరాలు

అనంతరం ‘బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే..’ అన్నమాచార్య కీర్తనను ప్రదర్శించారు.

బతుకమ్మ సంబరాలు

ఈ అంశం ‘తందనానా భళా తందనానా..’ అంటూ చిన్నారులు చిదులేశారు. బృందావన సారంగ రాగంలో ‘తిల్లాన’ అంశాన్ని కూడా ప్రదర్శించి ప్రేక్షకులకు కనువిందు చేశారు.

బతుకమ్మ సంబరాలు

నాట్యాచార్యులు కె.శ్రీనివాస్ బృందం ఘంటసార ప్రాంగణంలో ‘బంగారు బతుకమ్మ’ నృత్యరూపకాన్ని ప్రదర్శించారు. జానపద నృత్య శైలిలో బతుకమ్మను పూజిస్తూ అమ్మవారి కథను గానం చేస్తూ నృత్యాన్ని రమ్యంగా ప్రదర్శించారు.

Source link