My Dream My Project

Working On National Directory Of India

భారతదేశంలో దరిదాపు ఓ నలభైవేల పిన్ కోడ్ ఏరియాలున్నాయి. అక్కడ జనం తెలుసుకోవల్సిన విషయాలూ అనేకం ఉన్నాయి. ఇంచుమించు ఒక్కో పిన్‍కోడుకూ ఐదేసి మంది సమాచార నిర్వహణకి అవసరం. అందరూ కొత్తసినిమాలు గురించి కొట్టుకుంటుంటే మేం నిశ్శబ్దంగా వేరే పెను మార్పులు తీసుకువచ్చే పనిలో ములిగున్నాం. దరిదాపు రెండు లక్షలమంది స్త్రీలని వేరు వేరు ప్రాంతాల నుంచీ భారతదేశపు అత్యావశ్యకమైన సమాచార సేకరణ, నిర్వహణలలో శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు ఇవ్వబోవడం. అదీ కేంద్ర స్థానం రాజమండ్రిగా. నమ్మబుద్ధి కాదు. రాజమండ్రే కాదు. ఇంకా మారుమూల కుగ్రామంలో కూర్చుని కూడా చెయ్యచ్చు. చేస్తామేమో కూడా :)

అంతర్జాలం పరిచయం అయిందగ్గర్నుంచీ ప్రచురణ రంగంలో అనుభవం ఉండడం వల్ల సరికొత్త సాంకేతికవ్యవస్థ వల్ల ఉపయోగాలు నాకూ జనానికీ ఎలా ఉపయోగపడుతాయన్న దానిమీద దృష్టిపెట్టడం అనేక ప్రయత్నాలు చెయ్యడం, ఆ రీతిగా మరిన్ని కొత్త విషయాలు అవగాహన చేసుకుని ముందుకు సాగిపోవడం జరుగుతూనే ఉంది. ఐతే నాకాశక్తి కలిగిన అంశం ఎక్కణ్ణుంచైనా, ఎప్పుడైనా సొంత కంప్యూటర్ లేదా గాడ్జెట్ అవసరం లేకుండా పనిచెయ్యగలగడం, మన డేటా మనకూడా అందుబాటులో ఉండడం. దీన్నాధారంగా చేసుకునే పనికి వర్ట్యువల్ వర్కింగ్ అన్నారు కానీ ఇది ఎక్కువగా హోమ్బేస్డ్ వర్కింగ్ అంటారు గానీ రెండిటికీ చాలా వ్యత్యాసం ఉంది. హోమ్బేస్డ్ వర్కింగ్ కొంత వరకూ సొంత కంప్యూటర్, ఆఫ్లైన్ డేటా, ప్రోగ్రాంల పైన ఆధార పడి ఉంటుంది. వర్ట్యువల్ వర్కింగ్ పూర్తిగా ఆన్లైన్ అంతర్జాల ఆధారితం. కొన్ని సదుపాయాలకి కొన్ని త్యాగాలు తప్పవు.

కుతూహలం ఉన్నవాళ్ళు నన్ను సంప్రదించండి. ఫోన్లలో సమాధానం ఇవ్వడం కష్టం కనుక ఈ పోస్టు కింద కామెంటుతో సరిపెట్టండి. మీకు అవసరమైన లింకులు పంపిస్తాను.

One clap, two clap, three clap, forty?

By clapping more or less, you can signal to us which stories really stand out.