వీరుడు (Warrior) — A telugu tribute poem to Baahubali

I recently wrote a Poem on the valor of a warrior in Telugu paying tribute to Baahubali 2. English translation and video with my voice is available if you want to watch ! Please share it if you like it :)

వేగం వేగం అది జగన్నాథ రథ చక్రపు వేగం …

ఉద్వేగం ఉద్వేగం అది రథ సారథి నరనరాల్లో ఉప్పొంగుతున్న ఉద్వేగం …..

నీలకంఠుడి కంఠంలో ఘోషణ , శంఖంలో పూరించిన ఆక్రోశమల్లె ఆవహించెను ….

పోటెత్తిన అలలలాగా విజృంభించిన సైనికమూక ఆ వీరుడి ఖడ్గతీరాన్ని తాకి నేలకొరిగెను ….

ప్రచండ వాయువులు విలయతాండవం చేస్తున్నా తల వంచని శిఖరమల్లే నడక సాగించెను ….

అరణ్యమంటి సైనిక బృందాన్ని సమూలంగా నాశనం చేసే కార్చిచ్చు వోలె విజృంభించు ధీరా !

నింగిని నేలను , పగటిని రేయిని , వెలుగును నిశీధిని వేరుచేస్తూ వీరోచితంగా పోరాడు ధీరా !

ఆవరించిన కారుమబ్బుల్ని చీల్చుకొని అనంతమైన వినీలాకాశపు అంచుల్ని తాకే మేరునగ వోలె తలదించక పోరాడు ధీరా !

గగనతలాన్ని భువిని సంధి చెయ్యగల మెరుపు వోలె ప్రకంపించు ధీరా !

గర్జించే ఉగ్రనారసింహుడి రూపం , ధిక్కారస్వరంతో హుంకరించే మదగజపు అడుగులు ….. అడుగులు కాదవి శత్రుసైన్యపు ఎదలో పిడుగులు!

నీ ఖడ్గానికంటిన నెత్తుటిచార నీ నుదుటన వీరతిలకాన్ని మరిపించేను !

అద్వితీయం , అవర్ణనాతీయం , అమోఘం ……

కోటిసూర్య సమప్రభా !!! సాహోరే బాహుబలి !!!

-రాంశ్రీ గౌతమ్ (Ramsri Goutham)