జాతీయ బాలికా దినోత్సవం
ఇదిగో జనవరి ఇరవెై నాల్గవ తేదీ!!
జాతీయ బాలికా దినోత్సవం!!
వివక్షతకిక వీడ్కోలు పలికేలా,
వివేకానికి పదును పెట్టేలా,
చిన్నచెల్లికి చేయూతనిచ్చేలా,
చిట్టితల్లికి బతుకునిచ్చేలా — -బాలికిదినోత్సవం!!
చిగురు లేతమొగ్గలు..
సింగారాలకు నెలవులు..
నవ్వుల పువ్వులసోయగాలు..
గలగల వురికే జలపాతాలు..
అమ్మా,నాన్నల కనుల పంటలు..
అన్నల తమ్ముల అనుబంధాలు..
బాలికలంటే బతుకుతీపి మకరందాలు!!
చిదిమేయొద్దు పొట్టలోనే పూపలుగగా —
చేయవద్దు సంతలా వ్యభిచారపుబేరం
నలిపేయొద్దు పశువులావాళ్ళ పసితనాన్ని!!
భయపెట్టొద్దు పిశాచంలా పీడకలవై —
బాల్యవివాహపు తంతులొద్దు!ఆడుకునేవయసులో…
అనాఘ్రాత పుష్పాలకి అంటువ్యాధులివ్వద్దు!!
మోహం,మోసంలేని పలకరింపులతో…
కామం,కాఠిన్యం లేని కరుణతో…
అఘాయిత్యాలు లేని ఆదరణతో…
బలవన్మరణాల బారినపడకుండా…