యువత


నేను ఆకాశంలో కి ఎగరటం ఆపేశాను!

ఎందుకంటే కొన్ని గంటలు టి.వి.ఛానల్ కి మేత కా కూడదని!

భవిష్యత్తుని భవ్యంగా వుంచుదామని!

నేను దాటి వచ్చిన. దూరాలు కొలవటం మానేశాను!

కొరత జాడ, నిరాశ నీడ మింగేయకుండా మిగలాలని!

ఆడపిల్లలకన్నీళ్ళు అందమైన కళ్ళలోన ఆసిడ్ గా కాల కుండా

దీక్ష గా వాస్తవికతతో వర్తమాన ప్రయోగం చేస్తున్నాను

చున్నీ తో శిరచ్చేదనాలకి నేను చాలా దూరం!

కిరసనాయిల్‌ చురుకుదనం నాకసలు నచ్చదు!

చిన్న, పెద్ద తెరలు చేస్తున్న (దోహం ముందే కనిపెట్టాను!

ప్రేమనే పేరుతో ఎన్ని రకాల దగాలు, వ్యవహారాలు

పొట్టలో పాపాయికి తద్దినాలు

వాస్తవాల వ్యభిచారాల రవాణాలని బట్టబయలు చేస్తా!

నా మహా ప్రయోగం ఫలితాలనివెల్లడిస్తా!

ముందుగా లాభం నాకూ నా వాళ్ళకీ,

పేటెంటు హక్కంటారా? అమ్మాయిలందరికీ అందిస్తా!

One clap, two clap, three clap, forty?

By clapping more or less, you can signal to us which stories really stand out.