Blogging in Telugu: A Road Map

Blogging in Telugu
Blogging in Telugu

Components of a blog post:

మీరు రాసే బ్లాగ్ పోస్టు ఏ విధంగా ఉండాలి అన్న విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. Telugu blogs లో బ్లాగ్ పోస్టులు ఖచ్చితంగా ఈ పద్ధతిలోనే ఉండాలి అన్న రూల్ ఏమి లేదు. అయితే ఎక్కువమంది ఫాలో అవుతున్నటువంటి ఒక format ఇక్కడ ఇవ్వబడింది. మీ వైవిధ్యభరితమైన ఆలోచనలతో, మీ సృజనాత్మకతతో కొత్తరకమైన పద్ధతుల్లో బ్లాగ్ పోస్టులను అందించవచ్చు. ప్రయోగాలు చేయడం ఎప్పుడు కూడా మంచి ఫలితాలనే ఇస్తుంది.

ఇక విషయానికొస్తే… ముందుగా

Headline/ Title:
ఏ బ్లాగు పోస్టులోనైనా అన్నింటికంటే ముందుగా కనిపించేది దాని టైటిల్.

ఇది ఆడియన్స్ ని మీవైపు ఆకర్షించేలా ఉండాలి.

స్పష్టంగా ఉండాలి. దానివల్ల ఈ పోస్టు చదవడం వల్ల ఆడియన్స్ కి ఎలాంటి ప్రయోజనం చేకూరుతుందో తెలుస్తుంది. ఉదాహరణకి

“5 Strategies to Rank Your Website on the First Page of Google in 30 Days”

ఈ టైటిల్ చూిన వెంటనే, ఈ వ్యాసం చదవడం వల్ల రీడర్ కి ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది, ఇది ఎన్ని రోజుల్లో సాధ్యమవుతుంది అని స్పష్టంగా అర్థమవుతుంది.

Headline ఎల్లప్పుడూ కూడా ఆడియెన్స్ దృష్టిని ని తన వైపు తిప్పుకునేలా ఉండాలి.

Headline ఎల్లప్పుడూ యూజర్లు సెర్చ్ చేసే Key Word కు మ్యాచ్ అయ్యేలా ఉండాలి. ఇంతకు ముందు మనం తెలుసుకున్న Neil Patel Ubersuggest Tool
సహాయంతో ఏ రకమైన కీ వర్డ్స్ తో ఆడియన్స్ సెర్చ్ చేయడం జరుగుతున్నది అన్నదాని గురించి తెలుసుకోవచ్చు. అదే రకమైన Key Word ని మీ టైటిల్లో ఉపయోగించడం ద్వారా ర్యాంకింగ్ మెరుగుపడి, ఎక్కువ మంది ఆడియన్స్ దృష్టిలో మీ బ్లాగ్ పోస్టు పడే అవకాశం ఉంటుంది.

Introduction:

టైటిల్ తర్వాత కనిపించేది ఇంట్రడక్షన్ (పరిచయం).

పోస్టులో నేరుగా కంటెంట్ లోకి వెళ్లిపోకుండా, అసలు పోస్టు దేని గురించి, దాని వల్ల ప్రయోజనం ఏంటి అన్న విషయాలపై కొంత ప్రాథమిక సమాచారాన్ని క్లుప్తంగా ఇవ్వడాన్ని ఇంట్రడక్షన్ అంటాము.

Introduction ఎల్లప్పుడూ

1. క్లుప్తంగా ఉండాలి

2. ఆసక్తికరంగా ఉండాలి. దీనిని బట్టే, పూర్తి పోస్టు చదవాలా వద్దా అనేది రీడర్ నిర్ణయించుకుంటాడు. అనవసరమైన విషయాలన్నీ ఇందులో రాస్తే, ముందుకు వెళ్లకుండా రీడర్ మీ వెబ్ సైటును వదిలి వెళ్ళిపోవడం జరుగుతుంది.

3. Introలో మీ Main keyword ను కనీసం ఒక్కసారి అయినా ఉపయోగించాలి. దానివల్ల మంచి ర్యాంకు లభించే అవకాశం ఉంది.

ఇక తర్వాత,

Main content:
ఇక్కడ అసలైనటువంటి కంటెంట్ ను అందించడం జరుగుతుంది. సాధారణంగా ఒక బ్లాగ్ పోస్టులో మూడు వందల నుండి రెండు వేల పదాల వరకు ఉండవచ్చు. ఈ సంఖ్య కంటే తక్కువ లేదా ఎక్కువ ఉన్న పోస్టులు కూడా మీకు కనిపిస్తాయి. మీరు చదువుతున్న ఈ Blogging in Telugu పోస్టులో రెండువేల పదాలు ఉన్నాయి.

ఒక బ్లాగ్ పోస్టులో ఎన్ని ఎక్కువ పదాలు ఉంటే ఆ keyword ర్యాంకు అవ్వడానికి అంతా అవకాశం ఉంటుంది. అలా అని చెప్పి అర్థం పర్థంలేని విషయాలన్నీ రాస్తూ పోతే, ఏ రీడర్ కూడా ఎక్కువసేపు మీ వెబ్ సైటులో సమయాన్ని గడపడం జరగదు. ఒక వెబ్ సైటుపై రీడర్లు ఎంత సమయాన్ని గడుపుతున్నారు అనేది కూడా అథారిటీని సూచిస్తుంది. ఎక్కువ సమయాన్ని గడిపినట్లయితే దానివల్ల ఆడియెన్స్ కి మంచి ప్రయోజనం లభిస్తుందని గూగుల్ భావించి ఆ వెబ్ సైటును ఆధారిటీ సైటుగా గుర్తిస్తుంది. ఫలితంగా మంచి ర్యాంకింగ్ లభిస్తుంది.

కొన్ని వెబ్ సైట్లు తక్కువ పదాలు కలిగిన పోస్టులను కూడా పబ్లిష్ చేస్తూ కూడా ర్యాంకింగ్ సాధిస్తున్నాయి. దీనికోసం ఎక్కువ సంఖ్యలో పోస్టులను పబ్లిష్ చేయాల్సి ఉంటుంది.

Sub Headlines:

మెయిన్ కంటెంటు మొత్తాన్ని ఓకే వ్యాసంగా రాసినప్పుడు అది చదవడానికి అనుకూలంగా ఉండకపోవచ్చు. అందువల్ల ఈ కంటెంటుని Sub Headlines కింద విభజించుకోవడం మంచిది. దీనివల్ల

1. బ్లాగు పోస్టు ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

2. ఈ Sub Headlines కి H2, H3 Tags ఉపయోగించడం వల్ల ర్యాంకింగ్ మెరుగవుతుంది.

3. రీడర్లు చదవడానికి అనుకూలంగా కూడా ఉంటుంది.

Media:

కంటెంట్లో తగిన మీడియాను ఉపయోగించండి. బ్లాగు పోస్టు రాసేటప్పుడు కేవలం టెక్స్ట్ మాత్రమే కాకుండా మిగతా కంటెంట్ ఫార్మెట్లను కూడా మీ బ్లాగు పోస్టులో అందించే ప్రయత్నం చేయండి.

మిగతా కంటెంట్ ఫార్మాట్లు అంటే…

Video

Image

Infographics

MP3, podcast

Xlsx, cheat sheet

Gif

లాంటివన్నమాట.

అన్ని మసాలాలు కలిపి వండినప్పుడు వంట ఎలా రుచికరంగా అవుతుందో, కంటెంట్ కూడా వివిధ ఫార్మాట్లను కలిపి, ఒక తుది రూపు తీసుకురాగలిగినప్పుడు కూడా అంతే గొప్పగా ఉంటుంది.

Conclusion:

ముగింపులో అతి ముఖ్యమైన భాగం Call to action.
అంటే ఈ పోస్టు చదివిన తర్వాత ఏం చేయాలో యూజర్లకి చెప్పాల్సి ఉంటుందన్న మాట. తద్వారా వారిని ఆ దిశగా ముందుకివెళ్లేలా ప్రోత్సహించవచ్చు. ఉదాహరణకి

Subscribe to my YouTube channel

Join my WhatsApp group

Buy my Blogging in Telugu Video course

Try the trial version

Act now. Offer expires soon.

ఈ విధంగా ఉంటాయి.

అవసరమనుకుంటే మొత్తం పోస్టులో చెప్పిన విషయాలను క్లుప్తంగా రెండు మూడు వాక్యాలలో మరొకసారి చెప్పొచ్చు. పూర్తిగా మళ్లీ మొత్తం వివరించాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మీ బ్లాగ్ పోస్టు రాయడం పూర్తిచేసి మంచి Call to Action తో ముగించండి.

Blogging in Telugu — Ultimate Guide

Written by

Get the Medium app

A button that says 'Download on the App Store', and if clicked it will lead you to the iOS App store
A button that says 'Get it on, Google Play', and if clicked it will lead you to the Google Play store