Telugusitara
1 min readNov 27, 2022

Basil leaves in telugu : తులసి అరోగ్య ప్రయోజనాలు
తులసి ని ఇంగ్లీష్ లో tulasi, holy basil అని పిలుస్తారు. తులసి శాస్త్రీయ నామం ఓసియం టెన్యుఫ్లోరం ( Ocimum tenuifloram). తులసిలో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి కృష్ణ తులసి మరియు రెండవది రామ తులసి. మనం ఎక్కువగా కృష్ణ తులసి ని పూజకి వాడుతాం. ఈ కృష్ణ తులసి ని ఆయుర్వేదం లో ఎక్కువగా వాడుతారు. పండగ రోజు స్త్రీలు తులసి మొక్క కి ప్రత్యేక పూజలు చేస్తారు ( basil leaves in telugu ). తులసి తీర్థాన్ని హిందూ సంప్రదాయం లో చాలా పవిత్రంగా భావిస్తారు. మనిషి చనిపోయే ముందు కూడా నోట్లో తులసి తీర్థం పోస్తారు. ఎందుకంటే తులసి 24 గంటలు ప్రాణ వాయువుని విడుదల చేస్తూ ఉంటుంది. అందుకే ప్రతీ ఒక్కరి ఇంట్లో తులసి మొక్కని పెంచుకుంటారు ( basil leaves in telugu).

తులసి ఆకుల ఉపయోగాలు : Health benefits of Basil leaves

1.తులసి ఆకులు తీసుకోవడం వల్ల నాడి వ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది. అంతేకాకుండా జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.

2.తీవ్ర జ్వరం తో బాధపడేవారు తులసి ఆకులను వేడి నీళ్లలో వేసి బాగా మరిగించి తాగితే డెంగ్యూ మరియు మలేరియా జ్వరం నుంచి చక్కని ఉపశమనం లభిస్తుంది.

3.మనం ఎన్ని రకాల మందులను వాడిన దగ్గు మరియు జలుబు త్వరగా తగ్గదు. కానీ తులసి ఆకులో కొంచం ఒమ తీసుకుని నమిలి తినాలి.ఇలా చేస్తే దగ్గు మరియు జలుబు త్వరగా తగ్గుతుంది.

4.గొంతు గరగర తో బాధపడుతున్నవారు నీటిలో తులసి ఆకులని వేసి మరిగించాలి. ఈ నీటిని నోట్లో పుక్కిలించినా గొంతు గరగర నుంచి మంచి ప్రయోజనం కనిపిస్తుంది.

5.కొంచం తులసి రసాన్ని తీసుకుని దానికి ఒక టీ స్పూన్ తేనె ని కలిపి తీసుకుంటే పైత్యం తగ్గుతుంది.

6.మూత్ర విసర్జన సమయంలో వచ్చే మంటని తగ్గించడానికి తులసి ఆకుల్ని మెత్తగా రుబ్బి దానికి పాలు చక్కెర ని కలిపి తీసుకుంటే మూత్ర విసర్జన సమయంలో వచ్చే మంటని తగ్గిస్తుంది.

Read full article : https://www.telugusitara.com/health-benefits-of-basil-leaves-in-telugu/