నీ కైనా , నాకైనా… ఊరవతల ఆరడుగుల జాగా.

SankarVNM
An Idea (by Ingenious Piece)
3 min readJun 3, 2020

నేను అహం , మరి నువ్వు?

ఒరే నువ్వు మారాలి రా… నువ్వు మారావురోయ్… వాడు మారడు రా… ఇలా మనం ఎక్కడో ఒక చోట, ఎప్పుడో ఒకప్పుడూ…వింటున్న అంటున్న మాటలే ఇవి.

అది, తండ్రీ కొడుకు తో కావచ్చు , స్నేహితుడు కావచ్చు , అన్నా తమ్ముడు తో కావచ్చు , సారాంశం ఒక్కటే, నువ్వు మారు ఇంకా చెప్పాలి అంటే నువ్వే మారు.

పండితుల నుండి పామరుల దాకా… అందరు చెప్పేది ఒక్కటే, నీలో జ్ఞాన జ్యోతి వెలిగించు… నేను… నాది.. అన్న అహం వీడు.

అదేంటో చిత్రం , అందరు పక్కవాడికి చెప్పేవాళ్ళే

చెప్పడం తప్పు కాదు చెప్పే అర్హత ఉందా, లేదా ? అన్న ఆత్మ పరిశీలన చెప్పేవాడికి వుందా?

మార్పు అనేది, ఒకడు చెప్పితే జరిగే ప్రక్రియకాదు , అది ప్రకృతి నియమం , జీవం ఉన్న ప్రతిప్రాణి ఆ నియమానికి లోబడే ప్రవర్తిస్తుంది.

నీ ఆశా , ఆలోచన , బుద్ది మార్చుకో అని చెప్పడం, మన పురాణా కాలం నుంచి వున్నదే…

బొందితో స్వర్గానికి వెళ్ళాలన్నకోరిక త్రిశంకుడు మార్చుకుంటే , విశ్వామిత్రుడు త్రిశంక స్వర్గాన్ని సృష్టించగలిగేవాడా?

తప్పూ అని తెలిసినా వశిష్ఠ మహర్షిని ఓడించాలి అన్న కోపం మార్చుకుంటే, విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కాగలిగేవాడా?

త్రిశంకుడి కోరిక, విశ్వామిత్రుడికి అహం, లోక హితం కాదూ… మీరు చేస్తున్నది తప్పు అని ఎంతమంది చెప్పినా వాళ్ళు మారలేదు.

ఫలితం ,విశ్వామిత్రుడు స్వర్గానికి పోటీగా, తన తపశ్శక్తితో త్రిశంక స్వర్గాన్ని సృష్టించాడు.

అంతటి తో ఆగక దెబ్బ తిన్న అహం తో, వశిష్ఠుడి ని ఓడించాలి అన్న క్రమం లో మళ్ళి తపస్సు చేయడం.

మేనకా వల్ల తప్పస్సు భగ్నం కావడం , విశ్వామిత్రుడి ద్వారా మేనకా శకుంతలకు జన్మ ఇవ్వడం, శకుంతల కొడుకు భరతుడి పేరుతో ఏర్పడ్డ భారతవర్ష, నేటి భారతదేశం అంతా మనకు తెలిసిందే.

ఎన్ని ఆటంకాలు వచ్చిన తాను కోరుకున్నది సాధించి చివరకు విశ్వమిత్రుడు బ్రహ్మర్షి అయ్యాడు, తాను ఏమిటో తెలుసుకొన్నాడు.

మహాభారతం లో స్వజనులను చంపి వచ్చే రాజ్యభోగాలు వద్దు అనుకున్న అర్జునుడు, కృష్ణుడి మాటవిని మసస్సు మార్చుకొని కురుక్షేత్ర యుద్ధంలో కొన్ని కోట్ల మంది చావుకు కారణమైనాడు.

ఎంతమంది ఎన్ని విధాలుగా చెప్పినా వినకుండా అనుకున్నది సాధించాలి అనుకున్న త్రిశంకుడు, విశ్వామిత్రుడు చేసింది తప్పా ?

కృష్ణుడి మాటలు విని యూద్దం చేసిన అర్జునుడిది తప్పా ?

లేదా నిన్నునువ్వు తెలుసుకోలేకపోవడం తప్పా ?

తాను చేస్తున్న పనిమీద తనకి వున్నా నమ్మకం, విశ్వామిత్రుడి స్వర్గాన్ని సృష్టించడానికి, బ్రహ్మర్షి కావడానికి పురిగొల్పింది.

కృష్ణుడి మీద అర్జునుడి నమ్మకం యూద్దాం చేసేలా కారొన్యముఖుడ్ని చేసింది.

మార్పు అనేది నిరంతరం ప్రక్రియ, ఎప్పుడైతే నువ్వు పక్కవాడిలో మార్పు కొడుకుంటున్నావో, అప్పుడే నీలో ఆ ప్రకియ ఆగిపోయినట్లే , నువ్వు మారకుండా పక్కవాడు ఎలా మారుతాడు?

ఇక్కడ మారడం అంటే పక్కవాడు చెప్పినట్లుగా చేయడం కాదు, నీకోసం నీవు తెలుసుకుకోవడం !

నువ్వు తెలుసుకోవడం మొదలు పెట్టిననాడు , నువ్వే ఒక ప్రంపంచం, ఈ బాహ్య ప్రపంచం తో నీకు పని ఉండదు . పక్కవాడు మారాలి అని కోరుకొనే సమయం కూడా నీకు ఉండదు.

నీకైనా, నాకై నా, నలుగురికి ప్రవచనాలు చెప్పే పండితుడికైనా, చివరకు నాలుగిళ్ళలో పాచి పనిచేసే పనిమనిషి ఐనా…

పంచుకొనేది ఊరవతల ఆరు అడుగులా జాగా.

ఈ విషయం తెలిసేటప్పటికీ , జుట్టు తెల్లబడుతుంది , చూపు సన్న బడుతుంది, కాలు తడ బడుతుంది, నాలుక మడత బడుతుంది, కోరిక చచ్చుబడుతుంది.

కరిగిపోయిన కాలాన్ని తిరిగి చుస్తే, నువ్వు నీకోసం జీవించినదాని కన్నా నీ చుట్టూ వున్న మనుషులకోసం ఎక్కవ బ్రతికావు, అని అర్థమైననాడు, నీ జన్మ వ్యర్థం.

చివరిగా ఒక మాట

కాలం నువ్వు సంపాదించే ఆస్తి కాదు… కట్టగట్టి కొడుకులకు కానుకగా ఇవ్వడానికి, కరిగిపోయే కర్పూరం అదిఆరిపోయేలోపు, నువ్వు నీకోసం నువ్వుగా జీవించు.

జీవితం యొక్క అర్దాన్ని తెలుసుకో, పరమార్థం అదే బోధపడుతుంది.

--

--

SankarVNM
An Idea (by Ingenious Piece)

I am a designer, photographer, storyteller, filmmaker, and entrepreneur living in Hyderabad, India.