సమయం లేదు మిత్రమా — తెలుగు శరణమా లేక తెలుగు మరణమా?

Revendra
Andhra Pradesh
Published in
1 min readFeb 5, 2017

ఇరవై ఒకటవ శతాబ్దం — విద్యా, ఉద్యోగం, కళా, సంభాశణ, అన్నీ ఆంగ్లంలో జరుగుటున్నాయి. ఒక వైపు ఆంగ్లం, మరోవైపు హిందీ నేతల అధిపత్య ధోరణి తెలుగుని అంధకారంలోకి నెట్టివెసాయి. ఆకరి ఊపిరితో ఇవాళా-రేపా అని కొట్టుమిట్టాడుతున్న తెలుగు తల్లి. నెల్లూరు నుంచి నిజామాబాద్ వరకు, మచలిపట్నం నుంచి మహబుబ్-నగర్ వరకు, అనంతపూర్ నుంచి అరకు వరకు, ఆంధ్రా-తెలంగాణా నుంచి అమెరికా వరకు తెలుగువారు ఉన్నా, ఆంగ్లం పెరుగుతుంది, తెలుగు తరుగుతుంది.

తెల్లవాడి నుంచి స్వాతంత్రం వచ్చింది కాని తెల్లవాడి భాషకు తెలుగువాడు బానిస అయ్యడు, నిస్సహాయ స్తితిలో ఆంగ్లంకి కొమ్ముకాస్తున్నడు. ప్రపంచీకరణ-సాంకేతికరణ విపరీతమైన ప్రభావం మన జీవనశైలిపై, మనం మట్లాడే భాషపై కనిపిస్తుంది. ఆంగ్లంపై యుద్దం చేసి ఆర్ధికంగా వెనకడుగువేయడం సబబు కాదు. ఆర్ధికంగా ఎదుగుతూ మన సంప్రదాయాలని, భాషని కాపాడుకోవాలి. ఎలా అనేది అంతుచిక్కని ప్రశ్న. రజకీయ నాయకులు, భషాభిమానులు తెలుగుని ప్రోత్సహించడానికి పలు చర్యలు తీస్కుంటున్నారు, నిపుణులు పరిశధ చేస్తున్నారు. సంతోశం. “మనం ఎమి చేయగలం?” అనే ప్రశ్న వెంటాడుతూనే ఉంటుంది.

ఒక తెలుగు పుస్తకం కొని చదవండి. అలగే ప్రాంతీయ వార్తలను, మీకు నచ్చిన వివిధ అంశాలను తెలుగులో చదవండి. ఉపయొగం ఎమిటి అంటారా? తెలుగులో కొత్త రచయితలని ప్రోత్సహించడం వలన లిఖిత తెలుగుకి ఊపిరిపొసినవారు అవుతారు. కొత్త అంశాలు, ఆలొచనలు, పదాలు తెలుగు వారికి తెలుగులో అందుబాటులోకి వస్తాయి. తెలుగు జీవనాడి ఇంకొన్నాళ్లు కొట్టుకుంటుంది.

తెలుగు తల్లి ఒడిలో శరణం, వీరమరణం!

--

--