వేగవంతమైన P2P డిపాజిట్లు మరియు ఉపసంహరణలు పరిచయం

BNS
Bitbns
Published in
3 min readAug 1, 2018

“మీరు ఎల్లప్పుడూ మెరుగవ్వగలరు. ఎవరూ మిమ్మల్ని మెరుగవ్వకుండా ఆపలేరు, మరియు దేనినైనా సరిచేసే మీ ప్రయత్నాన్ని ఎవరు ఆపలేరు .” — రోజన్నే బార్

Bitbns లో ఒకరినుంచి మరొకరికి లావాదేవిలను(Peer to Peer transactions) చేసుకునే పద్దతిని ప్రవేశపెడుతున్నందునకు మేము ఎంతగానో సంతోషిస్తున్నాము. ఇది భారతదేశంలో లక్షల మంది వినియోగదారులు డిజిటల్ ఆస్తులను సజావుగా ట్రేడ్(Trade) చేయటానికి సహాయపడే ఒక గొప్ప పద్దతి.

30 నిమిషాలలోపు రెండు పార్టీల మధ్య లావాదేవీలను పూర్తి చేసే వేగవంతమైన P2P లావాదేవీ.

ఒకరినుంచి మరొకరికి లావాదేవీలు(Peer to Peer transactions ) జరుపుకునే విధానము ఎలా ?

మీరు Bitbns Wallet కు INR’ ని డిపాజిట్ చేయాలని అనుకుందాం మరియు వేరొక వినియోగదారుడు తన Bitbns Wallet నుండి INR’ ను ఉపసంహరించుకోవాలని(withdraw) అనుకుందాం.

Bitbns లో INR’ జమ మరియు ఉపసంహరించుకునే విధానము.

జమచేయడం (Deposit ) ఎలా ?

URL : https://bitbns.com/trade/#/wallets/deposit/p2p/

  1. ‘Add Money to Wallet’ పైన క్లిక్ చేసి, డిపాజిట్ చేయాలనుకుంటున్న మొత్తాన్ని నమోదు చేయండి.
  2. మా పీర్-టూ-పీర్ మ్యాచ్ ఇంజిన్(Peer to Peer Match Engine) ఒక ఉపసంహరణ అభ్యర్థనను ఉంచిన వ్యక్తిని కనుగొంటుంది. ఉపసంహరణదారుని యొక్క ఈమెయిల్ ఐడిని(Email Id) ఒకచోట భద్రంగా వ్రాసుకోవండo మంచిది .
  3. మీ BidforX ఖాతాలోకి లాగిన్ అవ్వండి.
  4. వోచర్లు విభాగానికి(Vouchers Section) వెళ్లండి.
  5. మీరు డిపాజిట్ చేయాలనుకుంటున్న మొత్తాన్ని నమోదు చేయండి, ఉపసంహరణదారుని (Withdrawer)యొక్క ఈమెయిల్ ఐడిని(Email Id) ని నమోదు చేసి, ‘Generate Now ‘ పై క్లిక్ చేయండి.
  6. Voucher Code ను కాపీ చేసిన తర్వాత మీ Bitbns ఖాతాలో డిపాజిట్ విభాగానికి(Deposit Section ) వెళ్లి, ‘Submit Voucher Code’ పైన క్లిక్ చేసి, మీ ‘Voucher Code ’ని పేస్ట్ చేసి Submit చేసిన తర్వాత మీకు `Pending` స్టేటస్ వస్తుంది.
  7. ఉపసంహరణదారుడు(withdrawer) వోచర్ను(Voucher) అందుకున్నట్లుగా నిర్ధారించినప్పుడు మీ డిపాజిట్ ప్రక్రియ(Deposit Process) పూర్తవుతుంది.

ఉపసంహరించుకోవడం (Withdrawal) ఎలా ?

URL : https://bitbns.com/trade/#/wallets/withdraw/p2p/

  1. ‘Withdraw Money’ పై క్లిక్ చేసి, మీరు ఉపసంహరించుకోదలచిన మొత్తాన్ని నమోదు చేయండి.
  2. OTP ను ‘Authenticator OTP’ విభాగంలో నమోదు చేసి ‘Next’ పైన క్లిక్ చేయండి. (మీరు 2FA ను ప్రారంభించకపోతే, ఇక్కడ క్లిక్ చేయండి.)
  3. మా పీర్-టూ-పీర్ మ్యాచ్ ఇంజిన్(Peer to Peer Match Engine) ఒక డిపాజిటర్ ని కనుగొంటుంది.
  4. డిపాజిటర్ మొత్తాన్ని డిపాజిట్ చేసిన తర్వాత, మీరు ఒక వోచర్ కోడ్ను(Voucher Code) అందుకుంటారు. అలాగే, మీరు మీ ఇమెయిల్లో ‘Secret Key’ అందుకుంటారు.
  5. మీ BidforX ఖాతాలోకి లాగిన్ చేసినతర్వాత ‘వోచర్లు’ విభాగానికి(Vouchers Section) వెళ్ళండి.
  6. ‘Redeem Voucher’ పై క్లిక్ చేయండి.
  7. మీ Bitbns ఖాతాలో మీరు పొందిన వోచర్ కోడ్ను(Voucher Code) మరియు మీ ఇమెయిల్లో మీరు పొందిన సీక్రెట్ కీని(Secret Key) ఇక్కడ నమోదు చేయండి.
  8. ‘Redeem’ పై క్లిక్ చేయండి.
  9. BidforX లో మీకు వచ్చిన మొత్తాన్ని సరిచూసుకోవండి, ఒకవేళ మీకు వచ్చిన మొత్తం సరిపోకపోయిన లేదా Voucher Code తప్పు అయినా మీరు Dispute చెయ్యవచ్చు.
  10. మీ బ్యాంకు ఎకౌంటు లోకి మొత్తాన్ని తీసుకోవడానికి మీరు BidforX లో ‘ప్రొఫైల్’(Profile) కు వెళ్లి `withdraw` పై క్లిక్ చేయండి.

ఈ మా కొత్త పద్దతి Bitbnsలో ప్రస్తుత వ్యాపార వ్యవస్థను(Trading System) ఏవిధంగానూ ప్రభావితం చేయదు. ఈ మా కొత్త పద్దతి వలన మా వినియోగదారులు తమ trade కొనసాగించడం కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పీర్-టు-పీర్ ఎక్స్చేంజిల మాదిరిగా కొనుగోలుదారులను లేదా విక్రయించేవాళ్లను గుర్తించడంపై ఆధారపడి ఉండవలసిన అవసరంలేదు.

పీర్-టూ-పీర్ లావాదేవీలలో తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs )

1. డిపాజిట్ / ఉపసంహరణమునకు ఏ చెల్లింపు పద్ధతి ని ఉపయోగించవచ్చు?

  • మీరు BidforX Voucher ద్వారా డిపాజిట్ / ఉపసంహరించుకోవచ్చు.

2. క్రొత్త ఉపసంహరణ / డిపాజిట్ విధానము

  • కనిష్ట ఉపసంహరణ / డిపాజిట్ రూ. 1,000.
  • ఒక యూజర్ రోజుకు గరిష్టంగా ఒక్కసారిగా రూ. 1 లక్ష (Rs . 1 lakh per Withdrawal) ఉపసంహరించుకోవచ్చు మరియు రోజుకి మొత్తంగా రూ. 20 లక్షలు (Rs . 20 lakhs Per Day ) వరకు ఉపసంహరించుకోవచ్చు .
  • 10,000 లోపు(Below Rs . 10,000) డిపాజిట్/ఉపసంహరించుకునే మొత్తం 1,000కి గుణాంకమై ఉండాలి (Multiples of Rs. 1000).
  • డిపాజిట్/ఉపసంహరణ 10,000 పైబడి (Above Rs . 10,000) ఉన్నప్పుడు డిపాజిట్/ ఉపసంహరించుకునే మొత్తం 10,000కి గుణాంకమై ఉండాలి(Multiples of Rs. 10,000). ఉదాహరణకు మీరు రూ. 57,000 డిపాజిట్/ ఉపసంహరించుకోవాలనుకుంటే, మీరు రెండు డిపాజిట్ / ఉపసంహరణ అభ్యర్థనలను చేయాలి ఒకటి రూ. 50,000 మరియు మరొకటి రూ. 7,000 అయ్యి ఉండాలి .

3. ఒక వినియోగదారు వివాదాన్ని (dispute) ఎప్పుడు చేయగలడు ?

ఒక వినియోగదారు క్రింది పరిస్థితులలో వివాదాన్ని(dispute ) చేయగలడు :

  • రిసీవర్ ఇంకా జమ చెల్లింపును అంగీకరించనప్పుడు
  • డిపాజిటర్ సరియైన మొత్తాన్ని పంపించిన తర్వాత కూడా రిసీవర్ లావాదేవీలను ఖండించిన్నప్పుడు
  • డిపాజిటర్ ఒక తప్పుడు రసీదును కోడ్ను(Voucher code) సమర్పించినప్పుడు లేదా తప్పుడు మొత్తం పంపిచినప్పుడు.

పీర్ టు పీర్ లావాదేవీలు చేసుకునేటప్పుడు గమనించుకోవాలిసిన విషయాలు

  • డిపాజిట్లు కోసం మంచి రేటింగ్ పొందడానికి వీలైనంత త్వరగా లావాదేవీ యొక్క రసీదును కోడ్ (Voucher Code )సమర్పించండి.
  • ఉపసంహరణకు మంచి రేటింగ్ పొందడం కోసం సాధ్యమైనంత త్వరగా లావాదేవీని నిర్ధారించండి.

మా పీర్ టు పీర్ మ్యాచ్(peer to peer match) ప్రాధాన్యత మీరు లావాదేవీ చక్రాన్ని పూర్తి చేసే విధానం పైన ఆధారపడి ఉంటుంది. వివాదం(Dispute), పైన పేర్కొన్న ‘పీర్ టు పీర్ లావాదేవీలు చేసుకునేటప్పుడు గమనించుకోవాలిసిన విషయాలు’, కొన్ని అంతర్గత కారకణాలను బట్టి యూజర్ యొక్క విశ్వసనీయతను(User Credibility) నిర్దారించబడుతుంది.

చిట్కాలు: మీరు వెంటనే ఇంకేదైనా crypto కొనాలని కోరుకుంటే మీ Bitbns Wallet లో నిధులను ఉంచుకోవడం మంచిది.

హ్యాపీ ట్రేడింగ్!

Bitbns

(Note :- Incase of any mismatch in interpretation of above telugu instructions with english version of instructions our english version of Instructions will be considered Final.)

--

--

BNS
Bitbns

Official Medium Account of Bitbns — Fastest and easiest way to trade cryptocurrency in India. https://bitbns.com/