ఐఎస్ఐతో పాటు లష్కరే హస్తం… రెండో రోజు హెడ్లీ విచారణ

ముంబై : భారత ఆర్మీకి సంబంధించిన ఇంటెలిజెన్స్ సమాచారాన్ని సేకరించాల్సిందిగా పాకిస్తాన్ ఐఎస్ఐ అధికారి మేజర్ ఇక్బాల్ తనకు సూచించాడని ముంబై దాడి నిందితుడు డేవిడ్ హెడ్లీ వెల్లడించాడు. అమెరికాలో రహస్య ప్రాంతం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వరుసగా రెండో రోజున ముంబై సెషన్స్ కోర్టుకు అతను సాక్ష్యమిచ్చాడు. 2008 ముంబైలో ఉగ్రవాద దాడుల వెనుక పాక్ ఐఎస్ఐతో పాటు లష్కరే తొయబా హస్తం ఉందని అతను అందించిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. భారత ఆర్మీలో కొందరితో స్నేహం చేయాల్సిందిగా పాక్ ఐఎస్ఐ డేవిడ్ హెడ్లీని పురమాయించింది. కొందరు ఆర్మీ అధికారులను ఐఎస్ఐ ఏజెంట్లుగా నియమించే ప్రయత్నం జరిగిందన్నారు. లష్కరే తొయబాతో సంబంధం ఉన్న మేజర్ పాషాద్ తనకు తెలుసునని కూడా హెడ్లీ వెల్లడించాడు. మేజర్ పాషా తరువాత ఆల్ కై దాలో చేరాడన్నాడు. మరోపక్క లష్కరే తొయబాపై అమెరికా నిషేధాన్ని చట్టపరంగా ఎదుర్కోవాలని తాను సూచించినట్లు హెడ్లీ తెలిపాడు.

Read Andhra Jyothi epaper on Dailyhunt.