తీరానికి కొట్టుకొచ్చిన తిమింగలం

ముంబయి: మహారాష్ట్రలోని ముంబయిలో గురువారం రాత్రి జుహు తీరానికి 30 అడుగుల తిమింగలం కొట్టుకొచ్చింది. తిమింగలాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అధికారులు సముద్ర తీరానికి చేరుకొని తిమింగలం ఎలా చనిపోయిందో పరిశీలిస్తున్నారు. ఇటీవల తమిళనాడులోని ట్యుటీకోరిన్‌ జిల్లాలో తిరుచందూర్‌ వద్ద సముద్ర తీరానికి దాదాపు వంద తిమింగలాలు కొట్టుకొచ్చిన సంగతి తెలిసిందే. వాటిలో చాలా వరకు మరణించాయి.

Read Eenadu epaper on Dailyhunt Telugu