1. అది కాఫీ ఎలా అయ్యింది?

Aditya
Kauphy
Published in
1 min readApr 22, 2020

“ఏంటోయి, కే ఏ యూ పీ హెచ్ వై కాఫీ ఎలా అయ్యింది?” అనడిగారు ముల్లపొద ఇంట్లో ఉండే రమణారావు అంకుల్.
“ఏం అభిషిక్త వర్మ గుర్తులేరా బావా బావా పన్నీరు సినిమా నుంచీ? నరేష్ ని ఇంటర్వ్యూకి పిలుస్తారు, ఏం ప్రశ్నలకీ జవాబులు తెలియకపోయినా తండ్రి రికమెండేషన్ కాబట్టి ఎలాగోలా ఉద్యోగం ఇవ్వాలని కాఫీ స్పెలింగ్ అడుగుతారు?
మనది అదే బాపతు. అలాగే ప్రనౌన్స్ చెయ్యాలని ఎవరు చెప్పారు? ఇలా రాస్తే చదివినప్పుడు కాఫీ అవ్వదా?”

ఒకలా రాస్తేనే కధలవుతాయా? మనవీ కధలే. మనకి నచ్చినట్టు చెప్పుకుంటాం.”
“అవును కానీ తెలుగులో రాయడం కష్టం కదా మరి?”
“నిజమే. కానీ మన తెలుగులో పండినట్టు ఇంగ్లీషులో భావం పండదే మరి! ఇంగ్లీషులో మనకధలు చెప్పుకుంటే డిస్నీ చానెళ్ళో లయన్ కింగ్ తెలుగులో చూసినట్టుంది.”
“నీ ఖర్మ. ఏదోటి ఏడు!” అంటూ తాడుమీదున్న తుండుగుడ్డ తీసుకుని లోపలకి వెళ్ళిపోయారాయన.
కానీ వెళ్తున్నపుడు ఒక చిన్న చిరునవ్వుంది పెదాల మీద. ఎలా అఘోరించినా మనకధేకదా చెబుతున్నాడు అని కాబోలు. బయటకి కరుసుగా ఉన్నా మనిషి మంచోడే. చిన్నప్పుడు ఆఫీసునుంచీ ప్రియా స్కూటర్ మీద వస్తున్నప్పుడు మేము రోడ్డుమీద క్రికెట్ ఆడుకుంటుంటే రాళ్ళతో పెట్టిన వికెట్లు తియ్యక్కర్లేకుండా పక్కనుంచీ మెల్లగా వెళ్ళి మా ఫీల్డింగుకి అడ్డురాకుండా కొంచం దూరంగా పార్కింగు చేసేవారు. నవ్వేవారుమాత్రం కాదు. అలాగ సీరియస్గానే ఇంట్లోకి వెళ్ళిపోయేవారు. ఈ మధ్యనే మనవరాలితో ఆడుకుంటూ నవ్వడం నేర్చుకున్నట్టున్నారు. అప్పుడప్పుడూ రాత్రుళ్ళు కుక్కని తిప్పుతున్నప్పుడు డాబామీద మనవరాలిని ఆడిస్తూ ఆయన నవ్వడం చూస్తుంటాను. నేనూ నవ్వుకుంటూ అంకుల్ మంచోడే అని సైలెంటుగా వెళ్ళిపోతాను.
ఆ, ఇంతకీ మన ఇంట్రడక్షన్కి వెనక్కి వస్తే మన కధలే. పేరు తెలుగులో రాస్తే కష్టమవుతుందని ఇంగ్లీషులో పెట్టా.

సులువుగా ఉంటుంది, బుక్మార్కు చేసుకోండి — కంట్రోల్+డీ, మీకు నచ్చినపేరుతో సేవ్ చేసేసుకోండి. వెతుక్కోనక్కర్లేకుండా తిరిగిరావచ్చు.
చాలా కధలున్నాయి చెప్పుకోవడానికి — ..https://medium.com/kauphy

--

--

Aditya
Kauphy
Editor for

Coffee drinker, Semi retired, Sits on the beach thinking about the mountains. Have too many half-written drafts on my blog 🤦🏻‍♂️