Naresh chary
KisanMitra
Published in
3 min readOct 7, 2018

--

కట్రవాత్ రుక్కుబాయి

కులం :- ST-లంబాడి

గ్రామం :- తిరుమలాపూర్

మండలం :- పూడూరు

జిల్లా :- వికారాబాద్

రుక్కుబాయి గురించి చెప్పాలి అంటే చాల కష్టంతో కూడుకున్నది. అల ఎందుకు అన్నాను అంటే మేము తనని కలువడానికి వెళ్ళినపుడు తన భర్త చనిపోయి ఆరోజుకి 11 రోజులు అవుతుంది. ఇంతకు ముందు మా ఫీల్డ్ కోర్దినేటర్ వెళ్లి కలిసాడు, కానీ అక్కడ ఉన్న పరిస్థితులు దృష్ట్యా వెనుదిరిగాడు. కానీ ఆమెను కలువడానికి మళ్ళి అవకాశం దొరికింది. రుక్కుబాయి తన భర్త పేరు కత్రవాత్ నిల్యా. వీరికి ముగ్గురు సంతానం. మొదటి బాబు పేరు రమేష్(10 సంవత్సరాలు, 5వ తరగతి చదువుతున్నాడు) రెండవ పాపా పేరు నికిత (9 సంవత్సరాలు, 4వ తరగతి చదువుతున్నాడు), మూడవ బాబు పేరు విశాల్ (6 సంవత్సరాలు, 3వ తరగతి చదువుతున్నాడు) విరు అందరు సోమనగుర్తి గ్రామంలో ఉన్న ప్రభుత్వ బడిలో చదువుతున్నారు. ఆ బడి తిరుమలాపూర్ గ్రామం నుండి 3 కిలోమిటర్ దూరంలో ఉంది. అది కూడా అడవి దారిలో పోవాలి. ఆ ఉరిలో ఉన్న అందరు పిల్లలు అలగానే వెళ్లుతారు.

రుక్కుబాయి, విశాల్ (6 ఇయర్స్), నికిత (9 ఇయర్స్), రమేష్(10 ఇయర్స్)

ఇక విషయానికి వస్తే రుక్కుబాయి భర్త నిల్యా నాయక్ తనకు ఉన్న 2.30 ఎకరాల భూమిలో పెసర, జొన్న, పంటలు వేసాడు. పెసర్లు ఒక బస్తా కుడా రాలేదు. ఇక జొన్న అడవి పందులు రాత్రి పుటా వచ్చి తినడం వల్ల పంట మొత్తం పాడై పోయింది. మిగిలిన కొద్ది పంటను కాపాడుకోవడానికి నిల్యానయాక్ రోజు రాత్రి పుటా అడవి పందుల నుండి జొన్న చేనును కాపాడాటానికి కాపలాగా వెళ్ళి అక్కడే పడుకోనేవాడు. అలాగే తేది 23/09/2018 రోజు రాత్రి పూటా కూడా పొలం దగ్గరకు కపాలకు వెళ్ళి పొలము వద్ద ఏమైనదో తెలియదు కానీ అతను పడుకునే దగ్గరే మృతి చెందాడు. ఆరోజు రుక్కుబాయి కి ఆరోగ్యం బాగాలేదు. తన భర్త చనిపోయిన విషయం ఉదయం 9.30 గంటల తర్వాత తెలిసింది. తను వెళ్లి చూస్తే తన భర్త(నిల్యానయాక్) చనిపోయి ఉండటం చూసేసరికి రుక్కుబాయి, ముగ్గరు పిల్లలు ఏమి చేయలేని పరిస్థితిలోకి వెళ్లిపోయారు. పోలీసులు మిగితా అధికారులు వచ్చి చూసి పక్కవారు ఏమి చెప్పితే అది రాసుకొని వెళ్లి పోయారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ మరియు FIR కాపీ ఇంత వరకు రాలేదు. అవి రావడానికి సమయం పడుతుంది. ఇక్కడ విచిత్రమైన సంఘటన ఏమిటి అంటే నిల్యా నాయక్ తండ్రి పేరు టోక్య నాయక్, తల్లి పేరు భీమిలి బాయి, వీరికి మొత్తం ఐదుగురు సంతానం మొదటి వ్యక్తి శంకర్ ఇతను ఉరిలో గొడవల వాళ్ళ స్నేహితుల కొట్లాటలో చనిపోయాడు ఇది పోలీస్ కేసు కూడా కాలేదు ఎందు కంటే ఆ రోజులలో ఈ ఊరికి వెళ్ళడానికి సరైన దారి కూడా లేదు అంత అటవీ ప్రాంతం. శాంతి, కమల వీరికి పెండ్లిలు అయినవి , ఒకరు హైదరబాద్ లో ఇంకొకరు నర్సింగ్ తాండలో ఉంటారు వీరు బాగేనే ఉన్నారు, తరువాత నిల్యానాయక్ , చివరి అతను బాబు పుట్టాడు కానీ బాబుకు అమ్మవారు పోసింది కొన్ని రోజులకు చనిపోయాడు. ఇది జరిగి చాల సంవత్సరాల అవుతుంది. కొంతకాలానికి నిల్యానాయక్ తల్లి భీమిలి బాయి ఆరోగ్యం బాగాలేక చనిపోయినది, తండ్రి కూడా చనిపోయాడు. చివరికి నిల్యానాయక్ కూడా చనిపోయాడు. ఇక్కడ తనకు ఉన్న భూమి 2.30 ఎకరాల భూమి పాస్ బుక్ రాలేదు. ఆన్లైన్ పహనిలో 1.10 ఎకరాల భూమి కనబడుతుంది. కానీ పాస్ బుక్ మరియు రైతు బంధు చెక్ రాలేదు. రుక్కుబాయి భర్త(నిల్యా నాయక్) చనిపోయినప్పుడు VRO వచ్చి తన భర్త పేరు మీద ఉన్న భూమి యెక్క డాకుమెంట్స్ పోలీస్ వారికీ చూపించాడు. నా భర్త బతికి ఉన్నపూడు చాల సార్లు VRO, MRO దగ్గరకు పాస్ బుక్ ల గురించి అడిగిన ఇవ్వలేదు. నిల్యా నాయక్ ను వ్యవసాయ అధికారులు ఎన్నో సార్లు కలిసారు. కొత్త పాస్ బుక్ ఇస్తేనే నీకు రైతు భీమ వర్తిస్తుంది అని చెప్పారు. కానీ ఏమి లాభం రెవిన్యూ అధికారులు సరైన సమయములో ఇవ్వలేదు, ఇప్పటికి కూడా ఆ కుటుంబానికి భూమికి సంబంధించి కొత్త పాస్ బుక్ లు ఇవ్వలేదు. ఒకవేళ నిల్యా నాయక్ బతికి ఉన్నప్పుడు పాస్ బుక్ ఇచ్చి ఉంటె తను రైతు భీమా కు దరఖాస్తు పెట్టుకునే వారు. దానివల్ల నాకు ఇప్పుడు కొంతలో కొంతైనా నాకు మేలు జరిగేది కదా. అల జరగలేదు కనుక నేను ఇప్పుడు ఇంత ఇబ్బందిలో ఉన్నాను. ఇక పిల్లలు పరిస్ధితి కి వస్తే చనిపోయిన రోజు నుండి ఎవరికి కూడా ఆరోగ్యం బాగాలేదు. రుక్కుబాయి తన పిల్లలు రోజు తన భర్తను తలుచుకొని బాధ పడుతూ ఉన్నారు. రుక్కుబాయి చిన్న కుమారుడు అయిన విశాల్ మేము వెళ్లి నప్పుడు వింతగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఎండలో కూర్చొని పైకి చూస్తూ అలగానే ఉన్నాడు, కొద్ది సేపటికి తల్లి దగ్గరకు వచ్చి చేరాడు. మళ్ళి వెళ్లి అక్కడ కూర్చోడం చేసాడు. రుక్కుబాయి కి ఉన్న సవాలు తన పిల్లలకు మంచి చదువులు ఎలా చెప్పించాలి, తన భర్త పేరు మిధ ఉన్న పూర్తి భూమిని నా పిల్లలా పేరు మీదికి మార్చాలి. ఇప్పుడు నా పిల్లలా బాగోగులు ఎలా చూసుకోవాలి. అప్పుల విషయానికి వస్తే ప్రైవేట్ అప్పు ఒక లక్ష ముపైవేలు (1,30,000/-)ఉన్నది. బ్యాంకు అప్పు28000/- ఉన్నదీ. ఇప్పటికైతే ఎవరు ఇబ్బంది పెట్టడం లేదు. ఇక ముందు ముందు చూడాలి ఎలా ఉంటాదో. మాకు ఎలాగైనా సహాయం చేయండి. మా కుటుంబ పరిస్థతి ఎలా ఉందొ మిరే చుడండి అని బాధపడుతూ చెప్పింది.

--

--