Naresh chary
3 min readOct 6, 2018

లక్ష్మి వడ్ల

కులం :- BC-ముద్రాజ్

గ్రామం : — దాదాపూర్

మండలం :- దోమ

జిల్లా : వికారాబాద్

లక్షి వడ్ల తండ్రి రెడ్డిపల్లి రాజయ్య, తనకు దాదాపూర్ గ్రామానికి చెందిన అంజలయ్య అనే వ్యక్తితో వివాహం జరిగింది. అంజలయ్యకు ఇదివరకే బుచ్చమ్మ తో వివాహం జరిగింది కానీ ఆరోగ్యం బాగాలేక చనిపోయినది. మొదటి బార్యకు ఇద్దరు కొడుకులు, విరు హైదరాబాద్ లో కూలి పనులు చేసుకుంటూ ఉంటారు. విరి ఇద్దరికీ కూడా పెండ్లిలు అయినవి, అంజలయ్య కు లక్ష్మి తో వివాహం జరిగిన తరువాత కొద్ది రోజులు బాగానే ఉండేవారు. విరి ఇద్దరికీ ఇద్దరు బిడ్డలు, మొదటి కూతురు అనుష, రెండవ కూతురు అనిత. అంజలయ్య కొన్ని రోజులకు ఆరోగ్యం బాగాలేక ఇంట్లోనే ఉండేవాడు, లక్ష్మి కూలి పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించేది. తండ్రికి ఆరోగ్యం బాగాలేదు అంటే తన మొదటి బార్య కొడుకులు ఒక రోజు వచ్చి తండ్రికి, చిన్నమ్మకు (లక్ష్మి), ఇద్దరి పిల్లలకు హెల్త్ చెకప్ చెప్పించారు. కానీ అక్కడ చాల బదకరమైన విషయం బయట పడినది. అంజలయ్యకు, లక్ష్మికి HIV అని తెలినిది.కానీ ఇక్కడ సంతోష పడవలిసినది ఏమిటి అంటే ఇద్దరి పిల్లలు అయిన అనుషకు(10 ఇయర్స్), అనితకు(5 ఇయర్స్) HIV లేదు అని వచ్చింది.

అనుష(10 ఇయర్స్)- అనిత (5 ఇయర్స్)

ఇది తెలిసి మొదటి బార్య కొడుకులు ఆరోజు నుండి సరిగా తండ్రిని పట్టించుకోవడం మానేసారు. కొద్ది రోజులకు తండ్రి చనిపోయాడు.ఇక చిన్నమ్మ అయిన లక్ష్మిని కూడా సరిగా పట్టించుకోవడం లేదు. ఏదైనా ఒకరోజు ఇంటికి వస్తే 100 రూపాయలు చేతిలో పెట్టి వెళ్ళిపోయేవారు. లక్ష్మి తండ్రి అయిన రెడ్డి పల్లి రాజయ్య అప్పుడప్పుడు వచ్చి కూతురిని చూస్తూ తనకు తోచిన కాడికి సహాయం చేస్తూ ఉండేవాడు. రాను రాను లక్ష్మి ఆరోగ్యం (HIV) కూడా బాగాలేక పోవడం జరిగింది దీనికి తోడు రెండు కనులు కూడా కనబడలేక పోవడం జరిగింది. ఇక ఇల్లు గడవడం కష్టంగా మారింది. ఆకారికి వండుకోవడం కూడా ఇబ్బంది గా మారింది. ఇక పెద్ద పాపా అనుష అంత చిన్న వయస్సులోనే ఇంటి బాద్యతను నెత్తి మిదవేసుకొని అమ్మ చెప్పుతా ఉంటె అన్న వండటం, కుర వండటం చేతుంది. రేషన్ ద్వారా వచ్చిన బియ్యం ద్వారా నెల అంత సర్దుకోవడం జరుగుతుంది. లేని రోజు ఇబ్బంది పడుతుంటారు. ఈ బియ్యం కూడా తన తండ్రి ఇచ్చిన డబ్బులు ద్వారానే కొనుకోవడం జరుగుతుంది. పిల్లలు స్కూల్ లో ఒకపూట అక్కడ తింటారు. ఇంటి పక్కవాళ్ళు కూడా ఎవరు కూడా వీరిని పట్టించుకోరు. ఇక్క పిల్లలా పరిస్థితికి వస్తే దారుణంగా ఉన్నదీ. పెద్ద పాపా అనుష 5 వ తరగతి గౌర్నమేంట్ బడి లోనే చదువుతుంది, చిన్న పాపా అనిత కూడా ఇదే స్కూల్ లో చదువుతుంది. WHF foundation వారు స్కూల్ లో 6 నోట్ బుక్స్ ఇచ్చారు అవే సరిపెట్టుకుంటుంది. ఇంతకు ముందు వేరే వారి దగ్గర చిన్న చిన్న పనులు చేసేది నెలంత కష్టపడితే 200 రూపాయలు వస్తే బుక్స్ కొనుకోవడం జరిగిది. ఇక బట్టల విషయానికి వస్తే అంత అంత మాత్రమే. పెద్ద పాపా ఇంట్లో అన్ని పనులు చేస్తుంది. లక్ష్మి ఆరుబయటకు వెళ్ళాలి అన్న తోడుగా ఒక్కరు ఉండాలి. ఇంట్లో మరుగుదొడ్డి లేదు. రేచీకటి తగ్గడానికి అందరి దగ్గరకు వెళ్లి అడుక్కొని కడప మిద కూర్చొని తింటే తక్కువ అవుతుంది అంటే అలాగా కూడా 2 నెలలు ఇంటి ఇంటికి వెళ్లి బిక్షాటన చేసింది. కానీ పలితం శూన్యం. లక్ష్మి తన కండ్లు బాగు గురించి సరోజినీ దేవి, ఇతర హాస్పిటల్ కు కూడా వెళ్ళింది కానీ అక్కడ డాక్టర్లు నీకు కండ్లు రావు అని చెప్పేసారు. అల చెప్పేసరికి లక్ష్మి కుదిన్చుకపోయినది, ఏమి చేయలేక నరకయాతన పడుతుంది. రోజు రోజుకు తన ఆరోగ్యం క్షినిస్తుంది అని నా పిల్లలా పరిస్ధితి తలుచుకుంటే నాకు భయం వేస్తుంది, కనీసం నా పిల్లలా బాగోగులు చూసుకోవడానికి కూడా నేను పనికి రాకుండా పోయాను. నేను ఇంకా ఎన్ని రోజులు బతుకుతనో తెలియదు.

అనిత, లక్ష్మి, అనుష

తల్లిగా నా పిల్లలా మంచి చెడులు చూసుకొవలిసినది పోయే నా కూతురే ఇంత చిన్న వయస్సులోనే నా గురించి పట్టించుకోవడం చేస్తుంది. నా భర్త పేరు మిద 2.20 ఎకరాల భూమి ఉన్నదీ. నా మొదటి బార్య ఇద్దరి పిల్లలు చేరి సగం అంటే 1.10 ఎకరాలు వారికీ మిగితా 1.10 ఎకరులు నా ఇద్దరి కుతురుల్లు పేరు మిధ చేయాలి అంటే అల చేయడానికి ఒప్పుకోవడం లేదు, నాకు ఇంతకు ముందు ఒక 2 నెలలు పెన్షన్ వచ్చేది ఇప్పుడు రావడటం లేదు. దేవుడి దయ వాళ్ళ ఇప్పటి వరకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు పిల్లలకు రాలేదు. ఒకవేళ వస్తే కష్టంగా మారుతుంది, తట్టుకువడం మా వాళ్ళ కాదు. ఒకవేళ హాస్పిటల్ కు తీసుకోని పోవాలి అంటే మాకు అప్పు ఇచ్చేవారు మా పరిస్ధితి చూసి కనీసం దగ్గరకు కూడా రావడం లేదు ఇక ఎలా మరి? ఇది ఇలా ఉంటె నా భర్త బ్రతికి ఉన్నపుడు పరిగి ADB సొసైటి బ్యాంకు నుండి 28000/- అప్పు తీసుకొన్నాడు ఇప్పుడు అది కట్టుమని ఇంటికి నోటిసులు పంపుతున్నారు, ఇప్పుడు ఆ అప్పు నేను కట్టేలా లేను కదా. నా భర్త ఉన్నపుడు సరిగా పంటలు పండి ఉంటె బాగుండు కానీ అలా జరగలేదు. నేను ప్రతి నెల హాస్పిటల్ కు వెళ్ళుతాను హెల్త్ చెకప్ చేసుకోవడానికి. ఇక దారీ ఖర్చులు కూడా ఇబ్బందే అది కూడా మా నానా సహాయం చేస్తేనే వెళ్ళుతాను లేకుంటే కష్టం. హాస్పిటల్ కు వెళ్ళిన డాక్టర్ మంచి పౌష్టికాహారం తీసుకోవాలి అని చెప్పుతారు, కానీ డాక్టర్ కు తెలియదు కదా మేము ఎలా బతుకుతున్నామో, కనీసం కూరగాయలు వండుకొని తినే విదంగా ఉన్నానా నేను ఒక వేల వండాలి అన్న నాకు ఇబ్బందే కదా. ఇప్పుడు నా ఇల్లు ఎలా ఉందొ కూడా నాకు తెలియదు. ఇంటిముందు చూస్తున్నారు కదా ఆ మురికి కలువ, పందులు ఎలా ఉన్నాయా చూస్తున్నారు కదా. నా కూతుర్లు పొద్దున్న లేచి స్కూల్ కి వెళ్లుతారు మరల సాయంత్రం వస్తారు. వారు వచ్చే వరకు వారి గురించి ఎదురుచుస్తుంటాను.