డబ్బు రెట్టింపు మోసం గురించి విన్నారా?

Viknesh Kumar
PhonePe
Published in
2 min readJul 28, 2022

సురక్షితంగా ఉండడానికి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే

ప్రజలను మోసగించడానికి నేడు మోసగాళ్లు వినూత్నమైన మార్గాలను ఉపయోగిస్తున్నారు. చట్టబద్ధమైనదనిపిస్తూ, అంతిమంగా అమాయక ప్రజలను మోసగించే ఒక తెలివైన ఉపాయాన్ని వారు చాలా జాగ్రత్తగా రూపొందిస్తారు. రాత్రికి రాత్రే డబ్బును రెట్టింపు చేస్తామనే హామీతో ప్రజలను రెచ్చగొట్టడం ఈ మాయగాళ్లు అనుసరించే టెక్నిక్‌లలో ఒకటిగా నిలుస్తోంది.

డబ్బు రెట్టింపు మోసం ఎలా జరుగుతుంది

సన్నివేశం 1: ఒక మోసగాడు తాను ఒక చిన్న ఆర్థిక వ్యాపార సంస్థ ప్రతినిధిననే నమ్మించి, కాల్ చేస్తారు చాలా తక్కువ సమయంలో ఒక చిన్న పెట్టుబడికి ఎక్కువ రిటర్న్ లు వచ్చే వ్యాపారం ఉందని చెబుతారు. ఒక చిన్న మొత్తాన్ని పెట్టుబడి పెట్టేలా చేసి, తక్కువ కాలంలో రెట్టింపు మొత్తం ఇచ్చి, మీ డబ్బు విపరీతంగా పెరుగుతుందనే నమ్మకం కలుగజేస్తారు. మీ నమ్మకాన్ని పొందిన తర్వాత పెద్ద మొత్తంలో డబ్బును మోసం చేస్తారు.

సన్నివేశం 2: క్రెడిట్ కార్డ్ వినియోగం ఎక్కువగా ఉండడం లేదా ఎక్కువ సేవింగ్స్ బ్యాంక్ బ్యాలన్స్ ఉండడం ఆధారంగా మీరు ఒక ఉత్సాహపూరితమైన ఆఫర్ గెలుచుకున్నారనే సమాచారంతో SMS లేదా వాట్సాప్ ద్వారా మిమ్మల్ని సంప్రదిస్తారు. దాని ద్వారా చాలా తక్కువ సమయంలో మీ డబ్బును రెట్టింపు చేసుకునేందుకు మిమ్మల్ని అనుమతించే ఆఫర్ మీకు అందుబాటులో ఉందని చెబుతారు. మీ డబ్బును దోచుకోవడానికి మాత్రమే డబ్బును డిపాజిట్ చేయాలంటూ ఒక లింక్ ను మీతో పంచుకుంటారు.

డబ్బు రెట్టింపు మోసాల నుండి తప్పించుకునే విధానం

  1. అనుమానాస్పద లింక్ లపై క్లిక్ చేయవద్దు: మీరు రిటర్న్ లేదా గిఫ్ట్ కార్డ్ అందుకోవచ్చనే నమ్మిస్తూ మోసగాళ్లు మీకు ఒక లింక్ పంపుతారు. అలాంటి అనుమానాస్పద లింక్ లపై క్లిక్ చేయవద్దు.
  2. మీ క్రెడిట్ కార్డు నెంబర్, CVV, పిన్, OTP తదితరాల్లాంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎవ్వరితోనూ పంచుకోవద్దు: చట్టబద్ధ సంస్థలు లావాదేవీల కోసం వ్యక్తిగత సమాచారం కావాలని మీకు ఎన్నడూ కాల్ చేయడం, ఇమెయిల్ చేయడం, టెక్స్ట్ సందేశాలు పంపడం చేయవు. PhonePe ప్రతినిధి మని చెప్పుకుంటూ ఎవరైనా మిమ్మల్ని అలాంటి వివరాలు కోరితే, దయచేసి మెయిల్ పంపాలని వారిని కోరండి. @phonepe.com డొమైన్ నుండి వచ్చే ఇమెయిళ్లకోసం మాత్రమే స్పందించండి.
  3. కాంటాక్ట్ సమాచారం పొందడం కోసం చట్టబద్ధ వెబ్ సైట్లనే సదా ఉపయోగించండి: ఒక ఆర్థిక సంస్థకు చెందిన వారిమని చెప్పుకునే వారు ఒక కాల్ చేసి, అదే నెంబర్ కు తిరిగి కాల్ చేయమని మిమ్మల్ని కోరితే, వారికి తిరిగి కాల్ చేసే ముందు అధికారిక వెబ్ సైట్ లో నెంబర్ ను క్రాస్ చెక్ చేయండి.
  4. PhonePeలో డబ్బు అందుకోవడానికి మీరు ‘పే చేయి’ని కలిగి ఉండడం కానీ, లేదా మీ UPI పిన్‌ను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉండదని సదా గుర్తుంచుకోండి.
  5. ‘పే చేయి’ని నొక్కడం కానీ, లేదా మీ UPI పిన్‌ను ప్రవేశపెట్టడానికి ముందు దయచేసి మీ PhonePe యాప్ లో కనిపించే సందేశాన్ని చదవండి.
  6. Google, ట్విటర్, FB తదితరాలలో PhonePe సహాయ విభాగం నెంబర్ల కోసం శోధించవద్దు. PhonePe సహాయ విభాగాన్ని చేరుకునేందుకు ఏకైక అధికారిక మార్గం https://phonepe.com/en/contact_us.html
  7. PhonePe సహాయ విభాగం అని చెప్పుకునే ధృవీకరించని మొబైల్ నెంబర్లకు ఎన్నడూ కాల్ చేయకండి/స్పందించకండి.

మోసగాళ్లు సంప్రదించినప్పుడు మీరు ఏం చేయాలి?

  • వెంటనే మీకు అత్యంత సమీపంలోని సైబర్ క్రైమ్ సెంటర్‌కు వెళ్లి, ఫిర్యాదు చేయాలి. సంబంధిత వివరాలను (ఫోన్ నెంబర్, లావాదేవీ వివరాలు, కార్డు నెంబర్, బ్యాంక్ ఖాతా తదితరాలు) అందిస్తూ ఒక FIR దాఖలు చేయాలి. ప్రత్యామ్నాయంగా, ఈ లింక్ — https://cybercrime.gov.in/ ను మీరు ట్యాప్ చేయాలి. సైబర్ ఫిర్యాదు ఆన్ లైన్ దాఖలు చేసేందుకు సైబర్ సెల్ పోలీసులను 1930లో సంప్రదించాలి.
  • PhonePe ద్వారా మిమ్మల్ని సంప్దిస్తే, మీ PhonePe యాప్ కు లాగిన్ అయి, ‘సహాయం’కు వెళ్లండి. ‘ఖాతా భద్రత సమస్య/ మోసపూరిత కార్యకలాపాన్ని నివేదించు’ కింద మీరు మోసపూరిత సంఘటనపై ఫిర్యాదు చేయవచ్చు. ఇది కాకుండా మీరు support.phonepe.com కు వెళ్లండి.
  • మా అధికారిక ఖాతాల ద్వారా మమ్మల్ని సంప్రదించండి

Twitter: https://twitter.com/PhonePeSupport

వెబ్: support.phonepe.com

--

--