మోసాల గురించి నివేదించడానికి మార్గాలు- మీరు తెలుసుకోవాల్సినవి!

johncy John
PhonePe
Published in
2 min readDec 2, 2022

--

ఒక మోసం వల్ల బాధితుడైన వ్యక్తి, తాను మోసపూరిత కార్యకలాపాన్ని ఎదుర్కున్న సమయంలో PhonePe కస్టమర్ కేర్ ను సంప్రదించడమే ఒక మోసానికి సంబంధించిన వివాదం అవుతుంది.

PhonePeలో ఒక మోసానికి సంబంధించిన వివాదాన్ని లేవనెత్తేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనవి :

 1. PhonePe యాప్
 2. PhonePe కస్టమర్ కేర్ నెంబర్
 3. వెబ్ ఫారం సమర్పించడం
 4. సోషల్ మీడియా
 5. సమస్యల పరిష్కార విభాగం

PhonePe యాప్ ద్వారా ఫిర్యాదు లేవనెత్తే విధానం :

 • PhonePe యాప్ కు లాగిన్ కండి
 • కుడి మూలన ఉన్న సహాయం ”?”పై క్లిక్ చేయండి.
 • “లావాదేవీతో సమస్య ఎదురైంది/have an issue with the transaction” ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
 • తర్వాతి పేజీకి వెళ్లి, “మీ సమస్యను నివేదించండి/Report your issue” ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
 • దీంతో యాప్ ఇటీవల జరిపిన అన్ని లావాదేవీలను లిస్ట్ చేస్తుంది.
 • వివాదాన్ని లేవనెత్తాల్సిన లావాదేవీని కస్టమర్లు ఎంచుకోవాలి.
 • తర్వాత, కస్టమర్లు ”మోసపూరిత వ్యక్తి నుండి పేమెంట్ అభ్యర్థన అందుకున్నాను/I got a payment request from a fraudster” లేదా “మోసపూరిత వ్యక్తి నుండి కాల్ వచ్చింది/I received a call from a fraudster” ఆప్షన్ ఎంచుకోవచ్చు.
 • సంబంధిత ఆప్షన్ ను ఎంచుకున్న తర్వాత, PhonePeలో ఒక టికెట్ తయారు చేయబడుతుంది, ట్రస్ట్ అండ్ సేఫ్టీ బృందం దానిని సమీక్షించి, చర్య తీసుకుంటుంది.

PhonePe కస్టమర్ కేర్ ద్వారా ఒక వివాదాన్ని లేవనెత్తడం:

 • తమ ఫిర్యాదును లేవనెత్తేందుకు కస్టమర్లు కింది నెంబర్లలో ఒకదానిని ఉపయోగించి, PhonePe కస్టమర్ కేర్ ను సంప్రదించవచ్చు. 080–68727374 / 022–68727374. వారిని సంప్రదించిన వెంటనే, మా సహాయ విభాగం ఏజెంట్లు దానికి తగ్గట్టు టికెట్ లేవనెత్తుతారు.

వెబ్ ఫారం సమర్పణ ద్వారా ఒక వివాదాన్ని లేవనెత్తడం :

 • మా వెబ్ ఫారం లింక్-https://support.phonepe.com/ను ఉపయోగించి కస్టమర్లు ఒక టికెట్ లేవనెత్తవచ్చు
 • ఆ లింక్ ఆ తర్వాత రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్ ను, క్యాప్చాను ప్రవేశపెట్టేలా ప్రేరేపిస్తుంది.
 • క్రెడెన్షియల్స్ ను సమర్పించిన మీదట, అది మీ రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్ కు పంపిన OTPని ప్రవేశపెట్టాలని కోరుతుంది.
 • లాగిన్ విజయవంతమైతే, కస్టమర్లు, “ఒక మోసం లేదా అనధికారిక కార్యకలాపంను నివేదించవచ్చు”
 • కస్టమర్లు సంబంధిత మోసం ఆప్షన్లను ఎంచుకుంటే, వారు సహాయ విభాగాన్ని సంప్రదించు పేజీకి మళ్లించబడుతారు. అక్కడ కస్టమర్లు లావాదేవీ వివరాలు, డాక్యుమెంట్లను పంచుకోవచ్చు.
 • మోసపూరిత లావాదేవీ వివరాలను నింపి, సమర్పించిన వెంటనే, ఒక టికెట్ తయారు చేయబడుతుంది.
 • కస్టమర్ ఈ పోర్టల్ ను తాము లేవనెత్తిన టికెట్లపై అప్ డేట్లకోసం ఉపయోగించవచ్చు.

సోషల్ మీడియా ద్వారా ఒక వివాదాన్ని లేవనెత్తడం:

 • కస్టమర్లు మోసపూరిత సంఘటనలను మా సోషల్ మీడియా హ్యాండిల్ లో ద్వారా నివేదించవచ్చు.

ట్విటర్ — https://twitter.com/PhonePeSupport

ఫేస్ బుక్ -https://www.facebook.com/OfficialPhonePe

సమస్య పరిష్కార విభాగం ద్వారా ఒక వివాదాన్ని లేవనెత్తడం:

 • ఇప్పటికే లేవనెత్తిన టికెట్లపై సమస్యలను నివేదించేందుకు ఈ పోర్టల్ ఉపయోగించబడుతుంది.
 • కస్టమర్లు https://grievance.phonepe.com/ కు లాగిన్ కావాలి. కస్టమర్ ఇప్పటికే లేవనెత్తిన టికెట్ ఐడిని పంచుకోవచ్చు.

సైబర్ క్రైమ్ పోర్టల్ ద్వారా ఒక వివాదాన్ని లేవనెత్తడం

 • కస్టమర్లు తమకు జరిగిన మోసాలకు సంబంధించిన వివాదాలపై ఫిర్యాదు చేసేందుకు తమకు దగ్గర్లో ఉన్న సైబర్ క్రైమ్ బ్రాంచ్ ను సంప్రదించవచ్చు.
 • కస్టమర్లు https://www.cybercrime.gov.in/ లింక్ ఉపయోగించి, సైబర్ ఫిర్యాదును ఆన్ లైన్ ద్వారా కూడా లేవనెత్తవచ్చు.
 • ఇవి కాకుండా, కస్టమర్లు 1930 నెంబర్ ద్వారా సైబర్ సెల్ పోలీసులను కూడా సంప్రదించవచ్చు.

--

--

More from johncy John and PhonePe